✕
లవకుశ సినిమా(Lavakusa movie) బసంత్ థియేటర్(Basant theater)లో విడుదలయ్యింది. అటు సికింద్రాబాద్(Secunderabad)లో నటరాజ్ థియేటర్(Nataraj Theater)లో రిలీజయ్యింది. ఇప్పుడు ఈ రెండు థియేటర్లు లేవు. బసంత్ ప్లేస్‌లో అపార్ట్మెంట్ వచ్చింది.

x
Lavakusha movie
-
- లవకుశ సినిమా(Lavakusa movie) బసంత్ థియేటర్(Basant theater)లో విడుదలయ్యింది. అటు సికింద్రాబాద్(Secunderabad)లో నటరాజ్ థియేటర్(Nataraj Theater)లో రిలీజయ్యింది. ఇప్పుడు ఈ రెండు థియేటర్లు లేవు. బసంత్ ప్లేస్‌లో అపార్ట్మెంట్ వచ్చింది. నటరాజ్ థియేటర్ మూతబడింది. సికింద్రాబాద్ క్లాక్‌టవర్(Secunderabad clock tower) ఎదురుగానే నటరాజ్ ఉంది. లవకుశ సినిమా నడుస్తున్నన్నీ రోజులు క్లాక్ టవరంతా తిరుణాళ్ల మాదిరిగా ఉండింది. మ్యాట్నీకి టికెట్ దొరక్కపోతే పార్కులో పడుకుని మొదటి ఆట చూసి వెళ్లేవారు ప్రజలు. 63 ప్రాంతంలో అమీర్‌పేట(Ameerpet) చాలా చిన్న బస్తీ. పంటపొలాలు ఉండేవి. తెలుగు సినిమాలు మెయిన్ థియేటర్లో రన్ అయిన తర్వాత ముందుగా ఖైరతాబాద్(Khairatabad)లోని రీగల్ టాకీస్‌లో సినిమాలు వచ్చేవి. ఆ తర్వాత అమర్పేటలోని విజయలక్ష్మికి వచ్చేవి. (ఇప్పుడు విజయలక్ష్మి థియేటర్ కూడా లేదు. కాకపోతే అవశేషంగా ఉంది).
-
- లవకుశ మాత్రం ఎన్నాళయినా మెయిన్ థియేటర్ వదిలిపెట్టడం లేదు. అమీర్‌పేట వాసులకు విసుగొచ్చేసింది. పాపం వారు మాత్రం ఎన్ని రోజులని ఎదురుచూస్తారు? ఇక లాభం లేదనుకుని రిక్షాలు కట్టుకుని నటరాజ్ థియేటర్‌కు వెళ్లి సినిమా చూసి వచ్చేవారు. అప్పట్లో బేగంపేట రైల్వేస్టేషన్ ఒక ఆశ్రమంలా ఉండేది. కావాలంటే పూలరంగడు సినిమా చూడండి.. అందులో ప్రారంభ సీన్లను బేగంపేట రైల్వే స్టేషన్ బయటే తీశారు. చాలా అందంగా, నిర్మానుష్యంగా ఉండేదా స్టేషన్. స్టేషన్ పక్కనే రైల్వే గేటు ఉండేది. అది ఎప్పుడూ వేసి ఉండేది. అమీర్‌పేట ప్రేక్షకులు నటరాజ్ థియేటర్‌కు వెళ్లాలంటే ఈ గేటు దాటుకుని వెళ్లాలి. టికెట్ ఎక్కడ దొరకదోనన్న భయంతో ఆ గేటు దగ్గర కాపలా ఉన్న వ్యక్తికి లంచం ఇచ్చి రిక్షాలతో పట్టాలు దాటేవారు. ఆ రోజుల్లో ఆ కాపలా వ్యక్తి వంద రూపాయలు ఇలా సంపాదించాడని చెప్పుకుంటారు. వంద రూపాయలంటే ఆ రోజుల్లో పెద్ద అమౌంటే! విజయవాడలో లవకుశ సినిమా వన్‌టౌన్ మారుతీ టాకీస్‌లో వచ్చింది. ఆ థియేటర్ కూడా ఇప్పుడు లేదు. ఆ ప్లేస్‌లో షాపింగ్ కాంప్లెక్స్ వచ్చింది. లవకుశ సినిమా నడిచిన రోజుల్లో తారాపేట గూడ్స్ షెడ్డు నుంచి కాళేశ్వరరావు మార్కెట్ వరకు ఎడ్లబళ్లు బారులు తీరి వుండేవి. మరే సినిమాకు ఇంతటి ఆదరణ లభించలేదు.

Ehatv
Next Story