'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే 'ది కేరళ స్టోరీ'ని వివాదాలు చుట్టుముట్టాయి. థియేటర్లలో ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. కాగ‌, ఓటీటీ విడుదల కోసం కూడా అనేక‌మంది ఎదురుచూస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానుంది.

'ది కేరళ స్టోరీ' బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అయితే 'ది కేరళ స్టోరీ'(The Kerala Story)ని వివాదాలు చుట్టుముట్టాయి. థియేటర్లలో ఈ చిత్రం విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శిత‌మ‌వుతుంది. కాగ‌, ఓటీటీ విడుదల(OTT Release) కోసం కూడా అనేక‌మంది ఎదురుచూస్తున్నారు. 'ది కేరళ స్టోరీ' చిత్రం త్వరలో ఓటీటీలో విడుదల కానుంది. ఇందుకు సంబంధించి కొత్త అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం మేకర్స్(Makers) ఒప్పందం కుదుర్చుకున్నట్లు ప‌లు క‌థ‌నాలు వెలువ‌డ్డాయి.

'ది కేరళ స్టోరీ' చిత్రం బాక్సాఫీస్(Box Office) వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మొదటి వారాంతంలో ఈ సినిమా రూ.35.25 కోట్లు వసూలు చేసింది. ఈ స‌మ‌యంలోనే జీ నెట్‌వర్క్ 'ది కేరళ స్టోరీ' సినిమా స్ట్రీమింగ్ హక్కుల(Streaming Rites)ను కొనుగోలు చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా Zee5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక‌గా.. జులై 7న విడుద‌ల చేయ‌నున్నట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి. అయితే 'ది కేరళ స్టోరీ' చిత్ర నిర్మాతల నుంచి మాత్రం ఈ విష‌య‌మై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ది కేరళ స్టోరీలో అదా శర్మ(Adah Sharma)తో పాటు యోగితా బిహానీ(Yogitha Bihani), సిద్ధి ఇద్నానీ(Siddhi Idnani), సోనియా బలానీ(Sonia Balani) ప్రధాన పాత్రలు పోషించారు.

Updated On 14 May 2023 1:01 AM GMT
Yagnik

Yagnik

Next Story