సుదీప్తో సేన్ దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ' మొదటి రోజు నుండి బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రతిచోటా నిరసన మంటలు చెలరేగాయి. కొన్ని రాష్ట్రాల్లో సినిమాను నిషేధించారు. అయినప్పటికీ, అన్ని అడ్డంకులను దాటుకుని మంచి కలెక్షన్లను సాధించింది.
సుదీప్తో సేన్(Sudipto Sen) దర్శకత్వం వహించిన 'ది కేరళ స్టోరీ'(The Kerala Story) మొదటి రోజు నుండి బాక్సాఫీస్(Box Office) వద్ద అద్భుతమైన కలెక్షన్లు వసూలు చేస్తోంది. ఈ చిత్రానికి సంబంధించి ప్రతిచోటా నిరసన మంటలు చెలరేగాయి. కొన్ని రాష్ట్రాల్లో సినిమాను నిషేధించారు. అయినప్పటికీ, అన్ని అడ్డంకులను దాటుకుని మంచి కలెక్షన్లను సాధించింది. అదా శర్మ(Adah Sharma), యోగితా బిహానీ(Yogita Bihani), సోనియా బలానీ(Sonia Balani), సిద్ధి ఇద్నానీ(Siddhi Idnani) నటించిన 'ది కేరళ స్టోరీ' భారీగా ప్రేక్షకుల ఆదరణ పొందింది అంటున్నాయి సినీ వర్గాలు.
ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 218 కోట్ల రూపాయలను వసూలు చేసింది. సినిమా ఇండియా బాక్సాఫీస్(Indian Box Office)తో పాటు విదేశాల్లోనూ వసూళ్లను రాబడుతోంది. 'పఠాన్'(Pathaan) తర్వాత 'ది కేరళ స్టోరీ' 2023 సంవత్సరంలో రెండవ అతిపెద్ద హిందీ హిట్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం 14 రోజులలో ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 171.72 కోట్లు వసూలు చేసింది. 15 వ రోజు కేరళ స్టోరీ వసూళ్లు దాదాపు 177 కోట్లు కాగా, 16వ రోజు ఈ సినిమా 9 కోట్ల బిజినెస్(Business) చేసింది. దీంతో 'ది కేరళ స్టోరీ' మొత్తం వసూళ్లు 186 కోట్లకు చేరాయి. మే 12న అమెరికా(America)లో 38 కేంద్రాలలో విడుదలైన ఈ సినిమా అక్కడ కూడా భారీ వసూళ్లు రాబడుతుంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా(World Wide) 218 కోట్ల రూపాయలు వసూలు చేసిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.