సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్‌ (Vijaykanth) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్‌ చెన్నైలోని (Chennai) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్త విని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు.

సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటుడు విజయకాంత్‌ (Vijaykanth) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న విజయకాంత్‌ చెన్నైలోని (Chennai) ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించారు. ఆయన మరణవార్త విని అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఆసుపత్రి దగ్గరకు చేరుకుంటున్నారు. తమిళంలో (Tamil) పెద్ద ఎత్తున అభిమానులను సంపాదించుకున్న విజయకాంత్‌కు నల్ల ఎంజీఆర్‌ (MGR) అన్న పేరు ఉంది. అభిమానులు ఆయనను కెప్టెన్‌ అని పిల్చుకుంటారు. 1952 ఆగస్టు 25న జన్మించిన విజయకాంత్‌ పోలీసు పాత్రలలో మంచి పేరు తెచ్చుకున్నారు. సినీ నటుడుగా రాణిస్తూనే డీఎండీకే (DMDK) పార్టీని స్థాపించారు. అసెంబ్లీకి ఎన్నికయ్యారు కూడా. 2011 నుంచి 2016 వరకు ప్రతిపక్ష నాయకుడిగా పని చేశారు. విరుధాచలం, రిషివండియం నియోజకవర్గాల నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన మృతి పట్ల సినీ ప్రముఖులు, రాజకీయనాయకులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

Updated On 28 Dec 2023 12:26 AM GMT
Ehatv

Ehatv

Next Story