ఆస్కార్ అయితే అందుకున్నాం కాని... ఆస్కార్ తరువాత కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవి సంతోషంతో కూడినవి మాత్రమే కాదు.. ఆవేదనతో కూడినవి కూడా. ఈక్రమంలోనే ఇండియా నుంచి ఆస్కార్ తీసుకున్న షార్ట్ ఫిల్మ్ నిర్మాత గునీత్ మోంగా..ఆస్కార్ వేదికపై తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించారు.

ఆస్కార్(Oscar) అయితే అందుకున్నాం కాని... ఆస్కార్ తరువాత కొన్ని కొన్ని విషయాలు బయటకు వస్తున్నాయి. అవి సంతోషంతో కూడినవి మాత్రమే కాదు.. ఆవేదనతో కూడినవి కూడా. ఈక్రమంలోనే ఇండియా నుంచి ఆస్కార్ తీసుకున్న షార్ట్ ఫిల్మ్ నిర్మాత గునీత్ మోంగా(Producer Guneet Monga)..ఆస్కార్ వేదికపై తనకు జరిగిన అవమానాన్ని వెల్లడించారు.

ఆస్కార్ అందుకునేవరకూ.. అందరి దృష్టి ఆర్ఆర్ఆర్(RRR) పైనే ఉంది. ఈక్రమంలో రిజల్ట్ ఏమౌతుందా అని అనుకున్న క్రమంలో.. భారత్ కు మరో ఆస్కార్ లభించడం అందరిని విస్మయానికి గురి చేసింది. ఎటువంటి హంగు ఆర్బాటం లేకుండా ది ఎలిఫెంట్ విస్పరర్స్(The Elephant Whisperers) డాక్యూమెంటరీ ఫిల్మ్.. ఆస్కార్ సాధించి.. అందరి చూపు తమైపు తిప్పుకుంది. హాలీవుడ్(Hollywood) లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈక్రమంలో ఆస్కార్ వేడుకల గురించి ఈ డాక్యూమెంటరీ నిర్మాత గునీత్ మోంగా(Producer Guneet Monga) షాకింగ్ కామెంట్స్ చేశారు.

ఈసందర్భంగా ఆమె ఇండియాకు వచ్చిన తరువాత తన బాధను వెల్లడించింది. గునీత్ మోంగా మాట్లాడుతూ.. ఆస్కార్ అవార్డు తీసుకున్నాక నాకు అవమానం జరిగింది. దీనిని నేను భరించలేకపోతున్నారు. సాధారణంగా ఆస్కార్ అందుకున్న అనంతరం ప్రతి ఒక్కరికీ 45 సెకన్లు మాట్లాడే అవకాశం ఇస్తారు. ఎవరైనా అంతకంటే ఎక్కువసేపు మాట్లాడితే వారి మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేస్తారు. కానీ నేను మాట్లాడటం స్టార్ట్ చేయగానే, నా మైక్ కట్ చేసి మ్యూజిక్ ప్లే చేశారు అంటూ ఆవేదన వ్యాక్తం చేసింది గునీత్.

వాళ్ళు అలా చేయడం వల్ల... తాను ఎంతో ఆతృతతో.. సంతోషంతో చెప్పాలి అనుకున్న విషయం చెప్పలేకపోయాని అంటోంది గునీత్. ఏం మాట్లాడకుండేనే నేను వెనుదిరగాల్సి వచ్చింది అని గునీత్ మోంగా ఆవేదన వ్యక్తం చేశారు. మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేసేసరికి.. ఆస్కార్ ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కి తీసుకున్నట్లు అనిపించిందన్నారు. ఇది తనకు మాత్రమే జరిగిన అవమానం కాదని.. యావత్ భారత్​కు జరిగిన అవమానంగా భావిస్తున్నానని గునీత్ చెప్పారు.

అయితే గునీత్ మోంగా(Guneet Monga) ఆవేదనతో అలా మాట్లాడుతున్నారు కాని.. ఆష్కార్ అందుకున్నవారిలో ఒక్కరికే మాట్లాడే ఛాన్స్ ఉంటుంది అని అభిప్రాయం వ్యాక్తం అవుతుందిత. అప్పటికే డైరెక్టర్ మాట్లాడటంతో.. మోంగాకు అవకాశం లేకుండా పోయింది అని సమాచారం. ఆస్కార్ తీసుకున్నాక ఆర్ఆర్ఆర్ టీమ్ లో కూడా కీరవాణి(Keeravani) మాత్రమే మాట్లాడాడు. చంద్రభోస్(Chandrabose) నమస్తే అని మాత్రమే అన్నారు. ఆతరువాత వారికోసం స్పెషల్ గా ఏర్పాటుచేసిన పోడియం వద్దకు వెళ్ళి మాట్లాడాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఆస్కార్ అందుకున్నాకు కీరవాణి మాట్లాడగా.. చంద్రబోస్ ప్రత్చేకంగా రూపొందించిన పోడియంలోకి వెళ్ళి.. తన సంతోషాన్ని వెల్లడించారు.

Updated On 21 March 2023 6:32 AM GMT
Ehatv

Ehatv

Next Story