సినిమాలకు పేర్లు పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. సినిమా సక్సెస్‌ సగానికి సగం పేరుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే సినిమాకు పేరు పెట్టడానికి మేకర్స్‌ చాలా ఆలోచిస్తారు.

సినిమాలకు పేర్లు పెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని. సినిమా సక్సెస్‌ సగానికి సగం పేరుతోనే ముడిపడి ఉంటుంది. అందుకే సినిమాకు పేరు పెట్టడానికి మేకర్స్‌ చాలా ఆలోచిస్తారు. ఇప్పుడు ప్రిన్స్‌ మహేశ్‌బాబు(Mahesh)- మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌(Trivikram) కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న సినిమాకు ఏం పేరు పెడితే బాగుంటుందా అన్న డిస్కషన్‌లో మేకర్స్‌ ఉన్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఓ న్యూస్‌ ఈ నెలలోనే వినిపించనుంది. సూపర్‌స్టార్‌ కృష్ణ(Krishna) జయంతిని పురస్కరించుకుని ఈ నెల 31న సినిమా పేరుని ప్రకటించనున్నారు. ఇప్పటికే పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి. కొన్ని రోజులుగా గుంటూరు కారం పేరు బలంగా వినిపిస్తోంది.

అమరావతికి(Amaravathi) అటూ ఇటూ అనే పేరు కూడా ప్రచారంలో ఉంది. అయోధ్యలో అర్జునుడు, ఊరికి మొనగాడు, పల్నాటి పోటుగాడు అన్న టైటిల్స్‌ కూడ తెరమీదకు వచ్చాయి. చిత్రబృందం నిర్ణయం ఏమిటనేది ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఎక్కువగా గుంటూరు కారం, ఊరికి మొనగాడు పేర్లు వినిపిస్తున్నాయి. కృష్ణ నటించిన సూపర్‌ హిట్‌ చిత్రాలలో ఊరికి మొనగాడు ఒకటి. కొన్ని రోజులుగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ వచ్చే నెల తొలి వారం నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది జనవరి 13న సంక్రాంతి కానుకగా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న ఈ సినిమాలో మహేశ్‌బాబుకి జోడీగా పూజాహెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు.

Updated On 17 May 2023 2:32 AM GMT
Ehatv

Ehatv

Next Story