మెగా హీరో వరుణ్‌తేజ్‌తో(Varun tej) మరికొద్ది నెలల్లో ఏడడుగులు నడవనున్న హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ఆ లోపు కమిట్‌ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి వేడుక కోసం ఉభయ కుటుంబాలు మంచి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేసే పనిలో పడ్డాయి. అంత వరకు జాలీ ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తున్నారు సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి.

మెగా హీరో వరుణ్‌తేజ్‌తో(Varun tej) మరికొద్ది నెలల్లో ఏడడుగులు నడవనున్న హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి(Lavanya Tripati) ఆ లోపు కమిట్‌ అయిన సినిమాలన్నింటినీ పూర్తి చేయాలనుకుంటున్నారు. ఇటీవలే వీరి ఎంగేజ్‌మెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. పెళ్లి వేడుక కోసం ఉభయ కుటుంబాలు మంచి ముహూర్తాన్ని ఫిక్స్‌ చేసే పనిలో పడ్డాయి. అంత వరకు జాలీ ట్రిప్పులతో ఎంజాయ్ చేస్తున్నారు సొట్టబుగ్గల సుందరి లావణ్య త్రిపాఠి. అదలా ఉంచితే, ఈ అందమైన అమ్మాయికి ఓ అరుదైన వ్యాధి(Disease) ఉన్నదట. అలాగని సోషల్‌ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. నిజంగానే లావణ్యకు ట్రిపోఫోబియా(Trypophobia) అనే అరుదైన వ్యాధి ఉంది. ఈ విషయాన్ని లావణ్య త్రిపాఠియే గతంలో చెప్పారు. కొన్ని ఆకారాలను, వస్తువులను చూస్తే తెలియకుండానే తనలో భయం కలుగుతుందని లావణ్య పేర్కొన్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నానని రెండేళ్ల క్రితం ఆమె తెలిపారు.

ప్రస్తుతం ఈ కామెంట్స్‌ నెట్టింట మరోసారి చక్కర్లు కొడుతున్నాయి. 2017లో వచ్చిన మిస్టర్‌(Mister) సినిమా సమయంలో వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిలు ప్రేమలో పడ్డారు. ఆ తర్వాతి సంవత్సరం మళ్లీ వీరిద్దరు అంతరిక్షం సినిమాలో నటించారు. అప్పుడు ప్రేమ మరింత బలపడింది. అప్పట్నుంచి ఇద్దరూ ప్రేమించుకుంటూనే ఉన్నారు. జూన్‌ ప్రారంభంలో వీరి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది చివరల్లో వివాహం జరగనుంది. ప్రస్తుతం వరుణ్‌తేజ్ గాండీవధారి అర్జున అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన విడుదలవుతుంది. ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్‌గా నటిస్తున్నారు. వరుణ్‌ తేజ్‌ కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యవయంతో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. మిక్కీ జె మేయర్‌ దీనికి సంగీతం అందిస్తున్నారు.

Updated On 29 Jun 2023 7:36 AM GMT
Ehatv

Ehatv

Next Story