పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ సినిమా అభిమానులే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. రామాయణం(ramayanam) ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. సంభాషణలు, పాత్రల వేషధారణలతో పాటు సీత భారత్‌లో జన్మించినట్టు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. మొదటి మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తర్వాత తుస్సుమంది. కలెక్షన్లు బాగా తగ్గాయి. ఈ సినిమా కోసం సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(prabhas) ఇటీవల ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు కానీ సినిమా అభిమానులే కాదు, ప్రభాస్ ఫ్యాన్స్ కూడా నిరాశ చెందారు. రామాయణం(ramayanam) ఆధారంగా రూపొందిన ఆదిపురుష్ సినిమాను ఓం రౌత్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాపై అనేక వివాదాలు చుట్టుముట్టాయి. సంభాషణలు, పాత్రల వేషధారణలతో పాటు సీత భారత్‌లో జన్మించినట్టు చూపించడం వివాదాలకు కేరాఫ్‌గా నిలిచాయి. మొదటి మూడు రోజుల్లో 300 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసిన ఈ సినిమా తర్వాత తుస్సుమంది. కలెక్షన్లు బాగా తగ్గాయి. ఈ సినిమా కోసం సుమారు 600 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ప్రభాస్ కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ సినిమా ఇదే! ఇప్పుడు ప్రభాస్ తర్వాతి సినిమా కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ప్రాజెక్ట్ -కెలో ప్రభాస్ నటిస్తున్నారు.
ఈ చిత్రంలో లోకనాయకుడు కమలహాసన్(Kamal Hassan), బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan), నటి దీపికా పదుకొనె(Deepika padukone), దిశా పటాని(Disha Patani) వంటి అగ్ర తారలు నటిస్తున్నారు. వీరితో పాటు దుల్కర్ సల్మాన్ కూడా నటించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇంత భారీ తారగణంతో తెరకెక్కిస్తున్నారంటే బడ్జెట్ కూడా భారీగా ఉంటుంది. పైగా ఈ సినిమాకు భారీ స్థాయిలో గ్రాఫిక్స్ ఉండబోతున్నాయి. దీన్ని బట్టి సినిమా బడ్జెట్ 600 కోట్ల రూపాయలకు పైగానే ఉండబోతున్నది. ఇదే గనక నిజమైతే ఇండియాలోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీగా ప్రాజెక్ట్-కె రికార్డు సృష్టించనుంది. ప్రభాస్ ఈ సినిమా కోసం 150 కోట్ల రూపాయల పారితోషికాన్ని తీసుకుంటున్నారు. అలాగే అతిథి పాత్రలో నటిస్తున్న కమలహాసన్‌కు 20 కోట్లు ఇస్తున్నారట. దీపికా పదుకొనె రెమ్యూనిరేషన్ పది కోట్లకు పైగానే ఉంది. ఇక అమితాబ్ బచ్చన్, దిశా పటానీలు ఎంత తీసుకుంటున్నారో తెలియదు. అంటే ప్రాజెక్ట్ కె సినిమా కోసం రెమ్యూనరేషన్‌లకే 200 కోట్ల రూపాయలను వెచ్చిస్తున్నారన్నమాట. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో కూడా సినిమాను రిలీజ్ చేస్తున్నారు.