రాజా అనే పేరు వింటే చాలు ఠక్కున గుర్తుకు వచ్చేది పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali).. ఎదుటి వ్యక్తి పేరేదైనా రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు.

రాజా అనే పేరు వింటే చాలు ఠక్కున గుర్తుకు వచ్చేది పోసాని కృష్ణ మురళి(Posani Krishna Murali).. ఎదుటి వ్యక్తి పేరేదైనా రాజా అంటూ అతణ్ణి సంబోధించే ఒక మేనరిజమును సినిమాల్లో ప్రవేశపెట్టి దానికి ప్రాచుర్యం తెచ్చాడు. . పోసాని కృష్ణ మురళి టాలీవుడ్‌లో రచయిత , దర్శకుడు అన్న విషయం తెలిసిందే... ఆయన తెలుగు సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే కూడా రాశారు. అతను రెండు సినిమాలకు దర్శకత్వం వహించాడు - 2007 లో ఆపరేషన్ దుర్యోధన(Operation Duryodana) మరియు 2008 లో ఆపదమొక్కులవాడు(Aapada Mokkulavadu). టాలీవుడ్‌లో ఆపరేషన్ దుర్యోధన పెద్ద విజయం సాధించింది. పోసాని 100 కు పైగా తెలుగు
తెలుగు చిత్రాలకు రచయితగా పనిచేసాడు .

అయితే పోసాని తరచుగా వివాదస్పద వ్యాఖ్యలు చేస్తూ జనం నోళ్లలో నానుతుంటారు. గతంలోనూ ఓ ప్రెస్ మీట్ లో నటుడు పవన్ కళ్యాణ్‌ని 'లోఫర్' 'బ్రోకర్' అంటూ కొన్ని అన్‌పార్లమెంటరీ పదాలను ఉపయోగించారు .. దీంతో పవన్ అభిమానులు పోసానిపై భౌతిక దాడి కి పాల్పడ్డారు అంతేకాదు అతని ఇంటిపై రాళ్లు రువ్వారు. ఎప్పుడు ఏదో ఒక్క విషయంలో ఇన్వాల్ప్ అవుతూ తనదైన ష్టైల్లో విమర్శిస్తూ ఉంటారు . మనస్సులో ఏది అనిపిస్తే అది వెనుక ముందు ఆలోచించకుండా అనడం .. చివరకు అది వివాదస్పదాలకు దారి తీయడం ఎప్పుడు జరిగేదే..... అందుకే అందరు పోసానికి మాట్లాడటం రాదు అని అనుకోవడం కామన్ అయిపోయింది. అయితే నంది అవార్డుల విషయంలో పోసాని కాస్త ఘాటుగానే మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేసారు.

ఈ సారి సినీ నటుడు పోసాని కృష్ణమురళీ నంది అవార్డులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు నందీ అవార్డు రావడంపై స్పందించిన ఆయన దానిని తిరిగి ఇచ్చేస్తానంటూ వ్యాఖ్యానించాడు. టెంపర్ సినిమాలో ఆయన పోషించిన పాత్రకు నంది అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో పాల్గొన్న ఆయన.... ‘‘సినీ పరిశ్రమలో నంది అవార్డులకు ఎంతో ప్రత్యేకత ఉందన్నారు . గతంలో ఈ రెండు ప్రాంతాలకు ఈ రెండు, ఆ రెండు ప్రాంతాలకు ఆ రెండు అవార్డులను ఇవ్వాలని అనుకునేవారు. దీనిపై నేను అప్పుడే ప్రశ్నించాను. ఎదురించాను. అందుకే పోసానికి నంది ఇవ్వకూడదు అనుకున్నారు. కొంత మంది రైటర్ లు, ఆర్టిస్టులు నందులను పంచుకునేవారు. నందీ అవార్డులు పంచుకునే విషయంలో చాలా మంది దర్శక నిర్మాతలు నష్టపోయారు.అప్పట్లో ఓ సారి నంది అవార్డ్స్ ని అనౌన్స్ చేశారు కానీ ఇవ్వలేదు. నా కర్మగాలి నాకు టెంపర్ మూవీకి నంది అవార్డు వచ్చింది.తప్పదు అన్నట్టుగా ఇచ్చారు. కానీ, నేను నంది ని తిరస్కరించాను. నాకు అది కమ్మ అవార్డు లాగా అనిపించింది. అందుకే దాన్ని తిరిగిచ్చేస్తాను. ఈ అవార్డుల అంశంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. పాత వాళ్లకు ఇవ్వాలా? లేదా కొత్త వారితో కొత్తగా స్టార్ట్ చేయాలా? అనే విషయంపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకుంటాం’’అంటూ పోసాని తెలిపారు .

Updated On 7 April 2023 6:06 AM GMT
Ehatv

Ehatv

Next Story