అర్ధరాత్రి.. అందరూ ఆదమరచి నిద్రపోతున్నవేళ. అంతటా నిశ్శబ్ధం. ఆ రుద్రభూమిలో స్మశాన నిశ్శబ్దం. కీచురాళ్ల అరుపులు, ఎండుటాకుల చప్పుళ్లు తప్ప మరో శబ్ధం లేదక్కడ. రాత్రి ఒకటిన్నర.. ఆ సమయంలో మహాప్రస్థానంలో(Mahaprasthanam) కొలువైన పరమశివుడి చెంత చిత్తంలో మునిగిపోయారు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి(Thanikella bharani).

అర్ధరాత్రి.. అందరూ ఆదమరచి నిద్రపోతున్నవేళ. అంతటా నిశ్శబ్ధం. ఆ రుద్రభూమిలో స్మశాన నిశ్శబ్దం. కీచురాళ్ల అరుపులు, ఎండుటాకుల చప్పుళ్లు తప్ప మరో శబ్ధం లేదక్కడ. రాత్రి ఒకటిన్నర.. ఆ సమయంలో మహాప్రస్థానంలో(Mahaprasthanam) కొలువైన పరమశివుడి చెంత చిత్తంలో మునిగిపోయారు సినీ నటుడు, కవి, రచయిత తనికెళ్ల భరణి(Thanikella bharani). అసలేం జరిగిదంటే.. సూర్యాపేటలో(Suryapet) రాత్రి వేళ జరిగిన ఓ సాహిత్యసభకు తనికెళ్ల భరణి హాజరయ్యారు. అక్కడ కవుల ప్రసంగంలో మహాప్రస్థానం గురించి తెలుసుకున్నారు. ఆశ్చర్యపోయారు. వెంటనే సందర్శించాలని నిర్ణయించుకున్నారు. తన మనసులోని కోరికను సభకు ముఖ్య అతిథిగా హాజరైన జగదీశ్వర్‌ రెడ్డికి(Jagadeeswar Reddy) తెలిపారు. ఆయన అడిగిందే తడవుగా అర్ధరాత్రి 1:30 గంటలకు తనికెళ్ల భరణి ను మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి స్వయంగా మహాప్రస్థానం దగ్గరకు తీసుకెళ్లారు. వాహనం దిగుతూనే ప్రస్థానంలో కొలువై ఉన్న పరమశివుడి విగ్రహాన్ని చూసి పరవశించిపోయారు తనికెళ్ల భరణి. సుమారు గంట పాటు పరమశివుడి చిత్తం లో మునిగితేలారు. స్మశాన వాటిక నలుమూలల కలియ తిరుగుతూ మహా అద్భుతం అంటూ జాషువా పద్యాన్ని నెమరవెసుకున్నారు.
ఇచ్చోట నేసత్కవీంద్రుని కమ్మని
కలము, నిప్పులలోనఁ గఱఁగిపోయె
యిచ్చోట నేభూములేలు రాజన్యుని
యధికారముద్రిక లంతరించె
యిచ్చోటనే లేఁత యిల్లాలి నల్లపూ
సలసౌరు గంగలోఁ గలసిపోయె
అంటూ ఇంతటి అద్భుత మహాప్రస్థానాన్ని 20 ఏళ్ల క్రితం యూరప్ లో చూశాను అన్న తనికెళ్ళ భరణి, అక్కడ సైతం స్మశానం ఇరుకుగా ఉందన్నారు. ఆ తర్వాత మొట్టమొదటిసారిగా సూర్యాపేటలోనే అంతటి నిర్మాణాన్ని చూస్తున్నానని తెలిపారు. ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సువిశాలంగా, అహ్లాదకరంగా రూపుదిద్దుకున్న మహాప్రస్థాన దర్శనభాగ్యం ఇచ్చిన మంత్రి జగదీశ్వరరెడ్డి తో ధన్యోస్మి అంటూ ఆనందభాష్పాలతో వెనుదిరిగారు.

Updated On 28 Oct 2023 12:28 AM GMT
Ehatv

Ehatv

Next Story