బారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు వ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు విజయ్‌ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది ఆయనకు 68వ సినిమా అవుతుంది. వెంకట్‌ ప్రభు దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మే మాసం ఆఖరుకల్లా పూర్తి చేసి నటనకు బ్రేక్‌ ఇవ్వనున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి రాజకీయాలలో యాక్టివ్‌ కావాలని అనుకుంటున్నారట. ఇటీవల విజయ్‌ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించి చెప్పారు.

తమిళ సూపర్‌స్టార్‌ దళపతి విజయ్‌ (Thalapathy Vijay in Politics) సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఆనందం.. ఇతర చిత్రాల నిర్మాతల్లో కలవరం. ఎందుకంటే విజయ్‌ సినిమాలు కలెక్షన్లను కుమ్మి పారేస్తాయి కాబట్టి. ఒక్క మాటలో ఆయన వసూళ్ల రారాజు.. ప్రస్తుతం అత్యధిక పారితోషికాన్ని తీసుకుంటున్న నటుడు కూడా ఆయనే! ఇప్పుడు తమిళ ఇండస్ట్రీలో విజయ్‌ (Vijay) దరిదాపుల్లో మరో నటుడు లేడు. ఇంతటి స్థాయిలో స్టార్‌డమ్‌ను సంపాదించుకున్న విజయ్‌ యాక్టింగ్‌కు గుడ్‌బై చెబుతారా? లేక బ్రేక్‌ ఇస్తారా? అసలు ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకొచ్చిదంటే కోలీవుడ్‌లో ఇదే చర్చనీయాంశంగా మారింది కాబట్టి. ప్రస్తుతం విజయ్‌ లియో సినిమాలో నటిస్తున్నాడు. లోకేశ్‌ కనగరాజ్‌ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. బారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు వ్చింది. దీపావళి పండుగను పురస్కరించుకుని సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు విజయ్‌ తన తర్వాతి సినిమాకు రెడీ అవుతున్నాడు. ఇది ఆయనకు 68వ సినిమా అవుతుంది. వెంకట్‌ ప్రభు (Venkat Prabhu) దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలో ఈ సినిమా సెట్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది మే మాసం ఆఖరుకల్లా పూర్తి చేసి నటనకు బ్రేక్‌ ఇవ్వనున్నారనే ప్రచారం సోషల్‌ మీడియాలో జోరుగా సాగుతోంది. సినిమాలకు బ్రేక్‌ ఇచ్చి రాజకీయాలలో యాక్టివ్‌ కావాలని అనుకుంటున్నారట. ఇటీవల విజయ్‌ ఓటుకు నోటుపై విద్యార్థులకు, తల్లిదండ్రులకు వివరించి చెప్పారు. 2025లో విజయ్‌ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ, సేవా కార్యక్రమాలు, రాజకీయ అంశాలపై పూర్తి దృష్టి పెట్టనున్నారని కోలీవుడ్‌ కోడై కూస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల నాటికి క్షేత్రస్థాయిలో సత్తా చాటేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారని సమాచారం. మొత్తం మీద విజయ్‌ ఇప్పుడు తమిళనాడులో హాట్‌టాపిక్‌గా మారారు. ఆయన గురించే చర్చిస్తున్నారు.

Updated On 4 July 2023 1:10 AM GMT
Ehatv

Ehatv

Next Story