తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమాలు మాస్టర్, ఖైధీ, విక్రమ్. ఈ మూడు సినిమాలతో తనకంటూ ఓ రేంజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఈ కుర్రాడు. ‘మాస్టర్, ఖైదీ’తో సినిమాలతో మాంచి పేరు తెచ్చుకుని.. విక్రమ్ సినిమాతో LCU (Lokesh Cinematic Universe)ని క్రియేట్ చేసి మరో కొత్త ప్రపంచాన్ని శృష్టించాడు యంగ్ డైరెక్టర్. తలపతి విజయ్ తో తీస్తున్న రెండో సినిమా గురించి తాజాగా లియో- బ్లడీ స్వీట్ పేరుతో […]

తమిళ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు వినగానే మనకు గుర్తొచ్చే సినిమాలు మాస్టర్, ఖైధీ, విక్రమ్. ఈ మూడు సినిమాలతో తనకంటూ ఓ రేంజ్ ని క్రియేట్ చేసుకున్నాడు ఈ కుర్రాడు. ‘మాస్టర్, ఖైదీ’తో సినిమాలతో మాంచి పేరు తెచ్చుకుని.. విక్రమ్ సినిమాతో LCU (Lokesh Cinematic Universe)ని క్రియేట్ చేసి మరో కొత్త ప్రపంచాన్ని శృష్టించాడు యంగ్ డైరెక్టర్.

తలపతి విజయ్ తో తీస్తున్న రెండో సినిమా గురించి తాజాగా లియో- బ్లడీ స్వీట్ పేరుతో ఓ ప్రోమో విడుదల చేశారు చిత్ర యూనిట్. ఈ ప్రోమోకు యూట్యూబ్ లో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఓపెనింగ్ లో ఫస్ట్ ఎండ్ సెకండ్ షాట్ నుంచే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ఆడియన్స్ కి ఓ క్లారిటీ ఇచ్చేశాడు. క్లోజప్ అండ్ ఎక్ట్రీమ్ క్లోజప్ షాట్లతో సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగేలా డైరెక్ట్ చేశాడు లోకేష్.

ఇక లోకేష్ కనగరాజ్ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ యాడ్ అయితే ఎలా ఉంటుందో ఇంక చెప్పక్కర్లేదు. అనురుధ్ మ్యూజిక్ కు పే.....ద్ద ఫ్యాన్ ఫాలోయింగే ఉంది. ఈ కుర్రాడు విక్రమ్ సినిమాలో మోనింగ్ బీజీఎంతో యూత్ ని ఉక్కిరిబిక్కిరి చేశాడు. తలపతి విజయ్ తో అనిరుధ్ రెండు సినిమాలకు మ్యూజిక్ కంపోజ్ చేశాడు. ఇక రీసెంట్ గా రిలీజైన లియో- బ్లడీ స్వీట్ ప్రోమోలో తన వాయిస్ అండ్ మ్యూజిక్ ఇన్ స్ట్రుమెంట్స్ తో మరింత హైప్ ని పెంచేశాడు.

విజయ్ 67వ సినిమాను సెవెన్ స్త్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మిస్తున్నారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మనోజ్ పరమహంస పని చేస్తున్నారు.

Updated On 4 Feb 2023 2:06 AM GMT
Ehatv

Ehatv

Next Story