లియో (LEO) సినిమాతో కళ్లు చెదిరే కలెక్షన్లు సాధిస్తున్నాడు విజయ్ దళపతి (Thalapathy Vijay). తమిళంతో పాటు తెలుగులో కూడా లియో మూవీ అదరగొడుతోంది. నాలుగే నాలుగు రోజుల్లో.. అదిరిపోయే వసూళ్లు సాధించింది సినిమా.

Thalapathy Vijay lokesh kanagaraj Leo movie
లియో (LEO) సినిమాతో కళ్లు చెదిరే కలెక్షన్లు సాధిస్తున్నాడు విజయ్ దళపతి (Thalapathy Vijay). తమిళంతో పాటు తెలుగులో కూడా లియో మూవీ అదరగొడుతోంది. నాలుగే నాలుగు రోజుల్లో.. అదిరిపోయే వసూళ్లు సాధించింది సినిమా.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ లీడ్ క్యారెక్టర్ లో నటించిన సినిమా లియో. తమిళ టాలెంటెడ్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహించిన యాక్షన్ ఎంటర్టైనర్ లియో. ఈ సినిమా రీసెంట్ గా థియేటర్ల లో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను, అభిమానులని విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకు పోతుంది.
బాక్సాప్లీస్ దగ్గర బ్లాస్టింగ్ కలెక్షన్స్ సాధిస్తోంది లియో. ఈ సినిమా.. నాలుగే నాలుగు రోజుల్లో 405.5 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం విషేశం. ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింత వసూళ్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తెలుగులో రెండు రోజులకే 30 కోట్లకు పైనే వసూలు చేసిందట లియో.. తెలుగులో కూడా ఇదే జోరు చూపిస్తే.. ఇక్కడ కూడా సెన్సేషన్ క్రియేట్ చేసే అవకాశం ఉంది.
ఇక ఈమూవీలో విజయ్ సరసన త్రిష హీరోయిన్ గా నటించింది. దాదాపు 20 ఏళ్ళ తరువాత ఈ కాంబో కలిసి నటించినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం లో సంజయ్ దత్ (Sanjay Dutt), అర్జున్(Arjun), ప్రియా ఆనంద్ (Priya Anand), గౌతమ్ మీనన్ (Gautham Menon) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్ రవి చందర్ సంగీతం అందించారు
