తలపతి విజయ్(thalapathy vijay)-లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) కాంబినేషన్ వస్తున్న చిత్రం ‘లియో’(Leo). ఈ సినిమాపై రోజురోజుకు అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ సినిమా షూటింగ్‏లో మలయాళ నటుడు జోజు జార్జ్ (Joju George) జాయిన్ అయ్యారు. మరో నెల రోజులపాటు చెన్నై షెడ్యూల్ ఆయన పాల్గొననున్నారు. ‘లియో’ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)‏ అయిన ఖైదీ, విక్రమ్ సినిమాలకు లింక్ అప్ ఉంటుందట. ఆర్ట్ డైరెక్టర్ సతీష్ కుమార్ (Satheesh Kumar) లేటెస్ట్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ చూస్తుంటే త్వరలోనే కమల్ హాసన్ ‘విక్రమ్’(Vikram) అవతారం ఎత్తే అవకాశం ఉండేలా కనిపిస్తోంది.

ఇక ‘విక్రమ్’ సినిమాలో ది ఈగిల్ ఈజ్ కమిన్ (Eagle is Comin) అంటూ కమల్ హాసన్ (Kamal Haasan) నటించిన థీం సాంగ్ పోస్టర్ ‏ను సతీష్ కుమార్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎల్‏సీ‏యూ (LCU) అభిమానులు ‘కోడ్ వర్డ్ యాక్సెప్టెడ్’ అంటూ కమెంట్ చేస్తున్నారు. మరి ఇది ఎలా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.

ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాలో శంకర్ ‘ఇండియన్-2’ షూటింగ్‏లో ఉన్న కమల్ హాసన్ ఈ నెలాఖరులో దేశానికి రానున్నారు. ఇక లోకేష్ ఆయనతో షూట్ చేసే సీన్స్ మే లేదా జూన్‏లో షూటింగ్ నిర్వహించే అవకాశం కనిపిస్తుంది. ఇక ‘లియో’ సినిమా రచయిత రత్నకుమార్ (Rathna kumar) కూడా ‘లియో’లో విజయ్ సేతుపతి (Vijay Sethupathi) పాల్గొంటున్న చెప్పిన సంగతి మనకు తెలిసిందే. మక్కల్ సెల్వల్ ఈ సినిమా కోసం మూడు రోజుల కాల్షిట్ కేటాయించడంతోపాటు వాయిస్ ఓవర్ కూడా ఇవ్వనున్నట్టు సమాచారం.

అండ్ అలాగే ఇండియన్-2 (Indian2) చిత్రంలో సేనాపతి పాత్ర కోసం ఇప్పటికే గడ్డం పెంచుకున్న కమల్ హాసన్ (Kamal Haasan)‏ని మనం గమనించినట్లయితే ఈ లుక్ కూడా కొంచెం విక్రమ్ లుక్‏ను పోలి ఉంటుంది. ఇక ‘లియో’ చిత్రాన్ని సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‏పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్, త్రిష, సంజయ్ దత్, అర్జున్, కతీర్, ప్రియా ఆనంద్, మాథ్యు థామస్, బాబు ఆంటోని, గౌతం వాసుదేవ్ మీనన్, మిష్కిన్, శాండి, ఏజెంట్ టీనా వాసంతి, జార్జ్ మారియన్, మాయా ఎస్ కృష్ణన్ నటిస్తుండగా సంగీతం అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) అందిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది అక్టోబర్ 19న థియేటర్లలోకి రానుంది.

Updated On 13 April 2023 6:35 AM GMT
Ehatv

Ehatv

Next Story