తమిళ నటుడు విజయ్ తన నట జీవితాన్ని ముగించి.. రాజకీయాల్లోకి రావాలని
తమిళ నటుడు విజయ్ తన నట జీవితాన్ని ముగించి.. రాజకీయాల్లోకి రావాలని అనుకుంటున్నారు. ఇప్పటికే తన రాజకీయ ఆకాంక్షలను ప్రకటించారు. రాజకీయాల్లోకి వచ్చే ముందు కేవలం రెండు చలన చిత్రాలలో మాత్రమే నటించనున్నట్లు ధృవీకరించాడు. అందులో మొదటిది వెంకట్ ప్రభు సైన్స్ ఫిక్షన్ డ్రామా ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. ఈ ప్రాజెక్ట్ భారీ స్థాయిలో AGS ఎంటర్‌టైన్‌మెంట్ తెరకెక్కిస్తోంది. యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు కంపోజ్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఆడియోకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.
సాధారణంగా విజయ్ సినిమాలకు టీవీల్లో మంచి రెస్పాన్స్ వస్తూ ఉంటుంది. ఆ లిస్టులో ఈ సినిమా కూడా ఉంది. అయినప్పటికీ ఈ చిత్రం ట్రేడ్‌లో భారీ బజ్‌ను సొంతం చేసుకుంది. GOAT శాటిలైట్ హక్కులను అన్ని భాషల్లో కలిపి 90 కోట్ల రూపాయలకు జీ నెట్‌వర్క్ చేజిక్కించుకుంది. విజయ్‌కి ఉన్న క్రేజ్‌కి ఇది నిదర్శనం. ఈ చిత్రంలో త్రిష కృష్ణన్ అతిధి పాత్రలో కనిపించనుంది.