కక్కొచ్చినా కల్యాణమొచ్చినా ఆగవని అంటారు. అట్టాగే ఫ్యాన్స్‌కు ఆవేశమొచ్చినా ఆగదు. స్టార్ హీరోల సినిమా ట్రైలర్ రిలీజైతే చాలు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. లేటెస్ట్‌గా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapthi Vijay) కొత్త సినిమా లియో(Leo Movie) ట్రైలర్ రిలీజప్పుడు కూడా ఇదే జరిగింది. విజయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తోంది.
కక్కొచ్చినా కల్యాణమొచ్చినా ఆగవని అంటారు. అట్టాగే ఫ్యాన్స్‌కు ఆవేశమొచ్చినా ఆగదు. స్టార్ హీరోల సినిమా ట్రైలర్ రిలీజైతే చాలు ఫ్యాన్స్ నానా రచ్చ చేస్తుంటారు. లేటెస్ట్‌గా కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్(Thalapthi Vijay) కొత్త సినిమా లియో(Leo Movie) ట్రైలర్ రిలీజప్పుడు కూడా ఇదే జరిగింది. విజయ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో త్రిష(Trisha) హీరోయిన్‌గా నటిస్తోంది. లోకేశ్ కనగరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. అక్టోబర్ 19న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్నది. ఈ నేపథ్యంలోనే మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఫస్ట్ లుక్, టైటిల్ ప్రోమో గ్లింప్స్, ఫస్ట్ సింగిల్ లాంచ్ చేశారు. ఇవన్నీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లియో సినిమా ట్రైలర్ కూడా విడుదలయ్యింది. యూ ట్యూబ్‌ను షేక్ చేసి పారేస్తోంది. కాకపోతే ఈ ట్రైలర్ కారణంగా చెన్నై(Chennai)లోని ఓ థియేటర్ బాగా డ్యామేజ్ అయ్యింది. ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ రద్దు కావడంతో చెన్నైలోని కొన్ని థియేటర్లలో లియో ట్రైలర్‌ను ప్రదర్శించారు. చెన్నైలో ఉన్న రోహిణీ థియేటర్(Rohini Theatre)లో కూడా ట్రైలర్‌ను ప్రద్శించారు. ట్రైలర్‌ను చూసిన విజయ్ ఫ్యాన్స్ ఆనందాన్ని పట్టలేకపోయారు. హద్దులు దాటిన ఉత్సాహంత థియేటర్‌లోని కుర్చీలను విరగొట్టారు. సీట్లను చింపేశారు. నానా అల్లరి చేశారు. మొత్తంగా థియేటర్‌లో చిన్నపాటి విధ్వంసమే సృష్టించారు. వికృత ప్రవర్తన కారణంగా థియేటర్ చాలా మట్టుకు డ్యామేజ్ అయ్యింది. ట్రైలర్ పరసాదర్ ప్రసారం పూర్తియిన తర్వాత బయటకు వచ్చే దారిలో ఉన్న ఇనుప గేటును కూడా విరిచేశారు. థియేటర్‌లోని చెక్క తలుపులను కూడా విరిచేశారు. దీంతో రోహిణి థియేటర్‌ను తాత్కాలికంగా మూసేశారు. రిపేర్లు చేసిన తర్వాత మళ్లీ తెరుస్తారు. ఇక దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.కొందరు నెటిజన్లు మాత్రం థియేటర్ యాజమాన్యం అనుకున్న సమయానికి ట్రైలర్‌ను ప్రదర్శించలేదని అందుకే అభిమానులకు ఆగ్రహం వచ్చి ఇలా చేశారని అంటున్నారు. ఫ్యాన్స్ అంచనాలను ట్రైలర్ అందుకోలేకపోయిందని, అందుకే ఇలా చేశారని మరికొందరు అంటున్నారు.