తమిళంలో సూర్యవంశం(Suryavamsham) వంటి బంపర్‌హిట్‌ను అందించిన డైరెక్టర్‌ విక్రమన్‌(Vikraman) తెలుగులో కూడా చెప్పవే చిరుగాలి, వసంతం వంటి హిట్స్‌ ఇచ్చాడు. చివరగా 2014లో నిన్నైతాతు యారో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

తమిళంలో సూర్యవంశం(Suryavamsham) వంటి బంపర్‌హిట్‌ను అందించిన డైరెక్టర్‌ విక్రమన్‌(Vikraman) తెలుగులో కూడా చెప్పవే చిరుగాలి, వసంతం వంటి హిట్స్‌ ఇచ్చాడు. చివరగా 2014లో నిన్నైతాతు యారో అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. తమిళంలో ఎన్నో విజయవంతమైన సినిమాలను రూపొందించిన విక్రమన్‌ దశాబ్ద కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నాడు.

ఆయన భార్య జయప్రియ(Jayapriya) తమిళ ఫిలిం డైరెక్టర్స్‌ అసోసియేషన్‌కు(TFDA) అధ్యక్షురాలిగా ఉన్నారు. చాలా కాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. భార్య ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్లే విక్రమన్‌ సినిమాలకు దూరమయ్యారని తెలుస్తోంది. లేటెస్ట్‌గా జయప్రియ ఓ ఇంటర్వ్యూలో తన కష్టాలను చెప్పుకున్నారు. 'నేను వెన్నునొప్పితో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాను. వైద్యులు సిటీ స్కాన్‌ చేసి క్యాన్సరేమోనని అనుమానపడ్డారు.

బయాప్సీ చేస్తే విషయం తెలుస్తుందన్నారు. నా భర్త భయపడ్డారు. ఎలాంటి ఆపరేషన్‌ వద్దన్నాడు. క్యాన్సరో కాదో తెలుసుకోవాలి కాబట్టి నేను ఆపరేషన్‌కు ఒప్పుకున్నాను. అరగంటలో ఆపరేషన్‌ను పూర్తి చేస్తామన్నవాళ్లు మూడున్నర గంటలు తీసుకున్నారు. ఇది జరిగిన పది రోజుల తర్వాత అడుగు తీసి అడుగు వేయలేకపోయాను. ఒక నెల రోజులపాటు హాస్పిటల్‌లోనే పెట్టుకుని తర్వాత ఇంటికి పంపించారు. ఫిజియోథెరపీ చేయించుకోమని సలహా ఇచ్చారు.

అనారోగ్యం నుంచి కోలుకునేందుకు మందులు వాడాను కానీ పూర్తిగా కోలుకోలేకపోయాను. ఏం చేయాలో పాలుపోలేదు. నాకు తోడుగా ఇంట్లో ఎప్పుడూ ఇద్దరు నర్సులు ఉంటారు. భరతనాట్య కళాకారిణి అయిన నేను ఇప్పుడు కనీసం లేచి నిలబడలేకపోతున్నాను.
మూత్రవిసర్జనకు కూడా వెళ్లలేకపోతున్నాను.

ప్రతి రెండు గంటలకోసారి యూరిన్‌ బ్యాగ్‌ వాడుతున్నాను. నా అనారోగ్యం నా భర్తను చాలా బాధించింది. నా చికిత్స కోసం ఆస్తులన్నింటినీ అమ్మేశాడు. ఇప్పటికీ చాలామంది ఆయన్ను సూర్యవంశం సినిమాకు సీక్వెల్‌ తీయమని అడుగుతున్నారు. కానీ నన్నీ పరిస్థితిలో వదిలేయడం ఇష్టం లేదని ఆగిపోతున్నారు' అంటూ భావోద్వేగానికి లోనయ్యారు జయప్రియ.

Updated On 27 Oct 2023 7:27 AM GMT
Ehatv

Ehatv

Next Story