ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమైన మ్యూజిక్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో గాయని సౌజన్య(Soujanya Bhagavatula) విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్(Allu Arjun) ఫైనల్‌లో పాల్గొన్న గాయనీగాయకులందరినీ ప్రశంసించారు. ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్‌తో పాటు పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందించారు.
ప్రముఖ ఓటీటీ ఆహాలో ప్రసారమైన మ్యూజిక్ రియాల్టీ షో తెలుగు ఇండియన్ ఐడల్ 2(Telugu Indian Idol 2)లో గాయని సౌజన్య(Soujanya Bhagavatula) విజేతగా నిలిచారు. గ్రాండ్ ఫినాలేకు చీఫ్ గెస్ట్‌గా వచ్చిన అల్లు అర్జున్(Allu Arjun) ఫైనల్‌లో పాల్గొన్న గాయనీగాయకులందరినీ ప్రశంసించారు. ఈ సీజన్‌లో విజేతగా నిలిచిన సౌజన్యకు టైటిల్‌తో పాటు పది లక్షల రూపాయల నగదు బహుమతిని అందించారు. 'మీరు టైటిల్ గెల్చుకోవడం నాకెంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే, పిల్లలను తల్లిదండ్రులు ప్రోత్సహించడం సర్వ సాధారణం. కానీ భర్త, అత్తింటి వారి సపోర్ట్ ఉంటే ఓ మహిళ గొప్ప గొప్ప విజయాలు అందుకోవచ్చని మీరు నిరూపించారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు' అని సౌజన్యను ఉద్దేశిస్తూ అల్లు అర్జున్ అన్నారు. ఈ సీజన్‌లో ఫస్ట్ రన్నరప్‌గా నిలిచిన జయరాజ్‌కు మూడు లక్షల రూపాయలు, సెకండ్ రన్నరప్‌గా నిలిచిన లాస్యకు రెండు లక్షల రూపాయలను నగదు బహుమతిగా అందించారు. ఫినాలేలో సౌజన్య ఏదో ప్రియరాగం వింటున్నా, బూచాడే, సామీ సామీ వంటి పాటలను అద్భుతంగా పాడారు. ఆమె పాటలకు అల్లు అర్జున్ అయితే ఫ్లాటయ్యారు. 'మీరు పాటలు పాడటానికి గ్యాప్ ఇవ్వలేదు. వచ్చింది అంతే. ఇకపై గ్యాప్ ఉండదు. మీరు పాడుతున్న విధానం, తెలుగు భాషపై మీకున్న పట్టు గొప్పగా ఉంది. మీపై నాకు ప్రత్యేకమైన గౌరవం ఏర్పడింది. ఎందుకంటే, ఒక తల్లిగా రెండేళ్ల వయసున్న పాపను, కుటుంబాన్ని చూసుకుంటూనే మీ కలను నెరవేర్చుకోవడం కోసం ఎంతో శ్రమిస్తున్నారు. సౌజన్య ఈ స్థాయికి చేరుకోగలిగారంటే అందుకు కారణం ఆమె భర్త, అత్తింటి వారు సపోర్ట్‌గా నిలవడమే! నేను కూడా నా భార్యకు అండగా ఉంటాను. తనకు మనస్ఫూర్తిగా ఏదైనా చేయాలనిపిస్తే తప్పకుండా చేయమని చెబుతాను. నా భార్యకు ఫొటోషూట్ కంపెనీ ఒకటి ఉంది. అందులో మీ పాపకు, ఫ్యామిలీ మొత్తానికి ఫొటోషూట్‌కు నేను ఛాన్స్ ఇస్తున్నాను’’ అని అల్లు అర్జున్ మాట ఇచ్చారు. యువ టాలెంట్‌ను ప్రోత్సహించాలనే ఉద్దేశంతోనే తాను ఈ కార్యక్రమంలో పాల్గొన్నానని బన్నీ చెప్పారు.