నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో(Morphing Video)పై చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు బాసటగా నిలుస్తున్నారు. డీప్ ఫేక్ వీడియో(Deap Fake Video)ను రూపొందించిన దగుల్బాజీలను వదిలిపెట్టకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

Telugu Film Journalists Association
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika Mandanna)కు సంబంధించిన మార్ఫింగ్ వీడియో(Morphing Video)పై చాలా మంది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్మికకు బాసటగా నిలుస్తున్నారు. డీప్ ఫేక్ వీడియో(Deap Fake Video)ను రూపొందించిన దగుల్బాజీలను వదిలిపెట్టకూడదని, వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్(Telugu Film Journalists Association )కూడా రష్మికకు సపోర్ట్‌గా నిలిచింది. ఈ విషయమై అధ్యక్షుడు లక్ష్మీనారాయణ, ప్రధాన eకార్యదర్శి వై.జె.రాంబాబులు తెలంగాణ డీజీపీ అంజనీ కుమార్‌కు కంప్లయింట్ చేశారు. బాధ్యతగా వ్యహరించిన తెలుగు ఫిల్మ్ జర్నలిస్టు అసోసియేషన్‌ను అంజనీకుమార్ అభినందించారు. వెంటనే ఈ కేసును సైబర్ క్రైమ్‌కు అప్పగించారు. ఇలాంటి ఘటనలు జరిగిన వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అంజనీకుమార్ సూచించారు.
