సోషల్ మీడియాలో(Social media) కొందరు విపరీతపోకడలకు వెళుతున్నారు. అలా తమ శాడిజాన్ని చాటుకుంటున్నారు. బతికున్నవారిని చంపేయడం వీరికి సరదా! వ్యూస్ పెంచుకోవడం కోసం అడ్డమైన రాతలు రాస్తున్నారు. లేటెస్ట్‌గా ఇలాగే సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్(sudhakar) చనిపోయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
సోషల్ మీడియాలో(Social media) కొందరు విపరీతపోకడలకు వెళుతున్నారు. అలా తమ శాడిజాన్ని చాటుకుంటున్నారు. బతికున్నవారిని చంపేయడం వీరికి సరదా! వ్యూస్ పెంచుకోవడం కోసం అడ్డమైన రాతలు రాస్తున్నారు. లేటెస్ట్‌గా ఇలాగే సీనియర్ నటుడు, కమెడియన్ సుధాకర్(sudhakar) చనిపోయినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. సుధాకర్ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఐసీయూలో చావుబతుకుల మధ్య ఉన్నారంటూ వారం రోజులుగా సోషల్ మీడియాలో వదంతులు వినిపిస్తున్నాయి. దీనికి తోడు పరిస్థితి విషమించి ఆయన చనిపోయాడని కొందరు రాశారు. ఈ తప్పుడు వార్తలపై సుధాకర్ స్పందించారు.
తన ఆరోగ్యంపై వస్తున్న వార్తలు అబద్ధాలని, ఎవరూ నమ్మకండని రిక్వెస్ట్ చేశారు. తాను సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా ఉన్నానని, దయచేసి తప్పుడు వార్తలను నమ్మవద్దని కోరారు. స్వయంగాఓ వీడియోను రిలీజ్ చేశారు . ఇలాంటి రూమర్స్‌ను(Rumours) క్రియేట్ చేయకూడదని విన్నవించుకున్నారు. సుధాకర్‌పై ఇలాంటి వార్తలు రావడం ఇది మొదటిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయన ఆరోగ్యంపై రకరకాల వార్తాలు వచ్చాయి. నిన్నగాక మొన్న కూడా నటుడు కోట శ్రీనివాసరావు చనిపోయినట్టు తప్పుడు వార్తలు వచ్చాయి. పాపం కోట శ్రీనివాసరావు కూడా వివరణ ఇచ్చుకున్నారు.