బిగ్‎బాస్ సీజన్–7(Bigg Boss season-7) విజేత పల్లవి ప్రశాంత్(pallavi Prashanth), రన్నరప్ అమర్​దీప్(Amardeep) అభిమానులు రచ్చరచ్చ చేశారు.
డిసెంబర్ 17 అర్థరాత్రి గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోకు(anapurna Studio) చేరుకున్న ఇరువురి ఫ్యాన్స్ ఘర్షణ దిగారు. మొదట ఇరువురి మధ్య మొదలైన వాగ్వాదం కాస్త..గొడవగా దారితీయడంతో పరస్పరం దాడులకు దిగారు.

బిగ్‎బాస్ సీజన్–7(Bigg Boss season-7) విజేత పల్లవి ప్రశాంత్(pallavi Prashanth), రన్నరప్ అమర్​దీప్(Amardeep) అభిమానులు రచ్చరచ్చ చేశారు.
డిసెంబర్ 17 అర్థరాత్రి గ్రాండ్ ఫినాలే సందర్భంగా అన్నపూర్ణ స్టూడియోకు(anapurna Studio) చేరుకున్న ఇరువురి ఫ్యాన్స్ ఘర్షణ దిగారు. మొదట ఇరువురి మధ్య మొదలైన వాగ్వాదం కాస్త..గొడవగా దారితీయడంతో పరస్పరం దాడులకు దిగారు. మరోవైపు హౌస్‌ నుంచి బయటకు వచ్చిన అమర్​దీప్‎ ఫ్యామిలీపైనా.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ఎటాక్ చేశారు. అయితే పోలీసుల సహాయంతో ఎట్టకేలకు అక్కడి నుంచి బయటపడ్డాడు అమర్‎దీప్.

ఆదివారం బిగ్‎బాస్ సీజన్–7 గ్రాండ్ ఫినాలే(Bigg Boss Finale) సందర్భంగా అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అర్ధరాత్రి అన్నపూర్ణ స్టూడియోకు వచ్చిన.. విజేత పల్లవి ప్రశాంత్, రన్నరప్ అమర్​దీప్ అభిమానులు గందరగోళం సృష్టించారు. గ్రాండ్ ఫినాలే ముగిశాక..టాప్ సిక్స్ లో ఉన్న శివాజీ, అమర్, ప్రశాంత్, ప్రియాంక, అర్జున్, యావర్ బయటకు వచ్చారు. ఈ సమయంలోనే ఒక్కసారిగా అమర్‎దీప్‎పై.. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ విరుచుకుపడ్డారు. బూతులు తిడుతూ..కారు ముందుకు కదలనీయకుండా అడ్డుపడి దాడికి యత్నిచారు. కారు దిగాలంటూ అద్దాలు పగలగొట్టి రచ్చరచ్చ చేశారు. బిగ్ బాస్ హౌస్‎లో పలు సందర్భాల్లో పల్లవి ప్రశాంత్‎ని కించపరుస్తూ మాట్లాడారంటూ ఆగ్రహించారు. అదే సమయంలో కారులో ఉన్న అమర్‌ తల్లి, అతని భార్య భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని..ఇరువర్గాలను చెదరగొట్టారు. పోలీసుల సహాయంతో వారంతా అక్కడి నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం ఆ వీడియోలు సోషల్ మీడియోలో వైరల్ అవుతున్నాయి.

మరోవైపు బిగ్ బాస్ బజ్ హోస్ట్ గీతూ రాయల్ మీద కూడా దాడి జరిగింది. కొందరు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. కారు అద్దాలు పగలగొట్టారు. వారి నుండి తప్పించుకున్న గీతూ రాయల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆమె.. దాడి జరిగిన తీరు వివరించారు. ఆవేశంలో గీతూ రాయల్ బూతులు కూడా మాట్లాడింది. గీతూ రాయల్ పై దాడి వీడియో కూడా వైరల్‎గా మారింది.

Updated On 18 Dec 2023 3:26 AM GMT
Ehatv

Ehatv

Next Story