బిగ్ బాస్ ఏడో సీజన్(Bigg Boss Season 7) మొదలై పట్టుమని రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే హౌస్‌లో గొడవలు(Fights) మొదలయ్యాయి. సోమవారం ఎపిసోడ్‌లో శివాజీ(Shivaji), ప్రియాంక(Priyanka) మాత్రమే నామినేషన్లను పూర్తి చేశారు. మంగళవారం మిగిలిన వారందరూ తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. ఈ క్రమంలో హౌస్‌లో రచ్చ జరిగింది. కంటెస్టెంట్లు ఒకరినొకరు తిట్టుకున్నారు. మంగళవారం ఎపిసోడ్‌లో మొదట శోభాశెట్టిని(Shobha Shetty) బిగ్‌బాస్ యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచారు.
బిగ్ బాస్ ఏడో సీజన్(Bigg Boss Season 7) మొదలై పట్టుమని రెండు రోజులు కూడా కాలేదు. అప్పుడే హౌస్‌లో గొడవలు(Fights) మొదలయ్యాయి. సోమవారం ఎపిసోడ్‌లో శివాజీ(Shivaji), ప్రియాంక(Priyanka) మాత్రమే నామినేషన్లను పూర్తి చేశారు. మంగళవారం మిగిలిన వారందరూ తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. ఈ క్రమంలో హౌస్‌లో రచ్చ జరిగింది. కంటెస్టెంట్లు ఒకరినొకరు తిట్టుకున్నారు. మంగళవారం ఎపిసోడ్‌లో మొదట శోభాశెట్టిని(Shobha Shetty) బిగ్‌బాస్ యాక్టివిటీ రూమ్‌లోకి పిలిచారు. గౌతమ్, కిరణ్ రాథోడ్‌లను ఆమె నామినేట్ చేశారు. తెలుగు సరిగా రాకపోవడం, మాట్లాడని కారణంగా కిరణ్ రాథోడ్‌ను నామినేట్ చేశానని చెప్పారు. కనెక్ట్ కాకపోవడం, బాండింగ్ ఏర్పడకపోవడం, పాజిటివ్ వైబ్స్ రాకపోవడంతో గౌతమ్‌ని నామినేట్ చేసినట్లు వివరించారు. బయటకొచ్చిన తర్వాత గౌతమ్‌తో శోభాశెట్టి గొడవ పెట్టుకున్నారు. ఇక రతికను దామిని నామినేట్ చేశారు. అందుకు కారణం కూడా చెప్పారు. రతిక డల్‌గా ఉంటున్నారని, కిచెన్‌లో సాయం కూడా చేయడం లేదని చెప్పారు.
డిన్నర్ తర్వాత ప్లేట్ కడగలేదు కాబట్టి శోభాశెట్టిని నామినేట్ చేశానన్నారు. కాగా లాన్‌లో టేస్టీ తేజ, శోభాశెట్టి కాసేపు ముచ్చటించుకున్నారు. తాను సాయం చేస్తున్నప్పటికీ అందరూ తననే నామినేట్ చేస్తున్నారంటూ శోభాశెట్టి కన్నీరు పెట్టుకున్నారు. ఇక షకీలా, గౌతమ్‌లను ప్రిన్స్ నామినేట్ చేశాడు. నువ్వు ప్రిన్సా, మీ ఫాదర్ కింగా అని షకీలా అన్న కారణంగానే ఆమెను నామినేట్ చేశానని చెప్పుకొచ్చాడు. షో హాఫ్ అని తనను కామెంట్ చేసినందుకు గౌతమ్‌ను నామినేట్ చేశారని పేర్కొన్నాడు. ఇది జరిగిన తర్వాత తేజ ఏమన్నాడో ప్రిన్స్‌తో గౌతమ్ కృష్ణ చెప్పాడు. అది కూడా అందరి ముందు. దీంతో తేజ అడ్డంగా దొరికిపోయాడు. ఎవరేం చెప్పారో, ఎవరికేం చెప్పాలో అదే చెప్పానని తేజ తనను తాను సమర్థించుకున్నాడు. చివరగా తమ మధ్య మిస్ అండర్ స్టాండింగ్ వచ్చిందని ప్రిన్స్-గౌతమ్ హగ్ ఇచ్చుకున్నారు. రతికను నామినేట్ చసిన ఆట సందీప్ అందుకు కారణం కిచెన్‌లో కాస్త ఇర్సెస్పాన్సిబుల్‌గా ప్రవర్తించడమేనని చెప్పారు. పనిలో హెల్ప్ చేయట్లేదనే కారణంతో ప్రిన్స్‌ని నామినేట్ చేశాడు. అయితే ఇర్సెస్పాన్సిబుల్ అనే పదాన్ని తనపై వాడటం కరెక్ట్ కాదని సందీప్‌తో రతిక గొడవ పెట్టుకుంది.
మరోవైపు దామిని తనను నామినేట్ చేయడంపై ప్రిన్స్‌తో శోభాశెట్టి చాలాసేపు మాట్లాడింది. దామిని విధానం తనకు నచ్చలేదని ప్రిన్స్‌తో చెప్పుకుంది. మరోవైపు ప్రిన్స్‌ను షకీలా నామినేట్ చేసింది. తను సరదాగా మీ డాకీ కింగా అని అన్నానని, దానికి అతడు సీరియస్ అయ్యాడని, అందుకే అతడిని నామినేట్ చేస్తున్నానని షకీలా వివరించింది. తనకు కనెక్ట్ కాలేదు కాబట్టి పల్లవి ప్రశాంత్‌ను నామినేట్ చేశానని తెలిపింది. ఏదైనా పని చెబితే సరిగ్గా రెస్పాండ్ కావడం లేదని చెప్పింది. తనను ఓ చెత్త రీజన్‌కు షకీలా నామినేట్ చేశారని ప్రశాంత్ తనలో తాను అనుకున్నాడు. అందరిలో తక్కువ పని చేశారు కాబట్టి శోభాశెట్టి, ప్రిన్స్‌ను తాను నామినేట్ చేశారని గౌతమ్ పేర్కొన్నాడు. బయటకొచ్చిన తర్వాత మరోసారి గౌతమ్-శోభాశెట్టి మధ్య వాగ్వాదం జరిగింది. రతిక, శోభాశెట్టిని శుభశ్రీ నామినేట్ చేసింది. వాళ్లిద్దరికీ తాను కనెక్ట్ కాలేకపోయానని, హౌస్‌లో వారిద్దరు పెద్దగా పని చేయడం లేదని శుభశ్రీ వివరణ ఇచ్చుకుంది. గౌతమ్ చెప్పడం వల్లే శుభశ్రీ తనని నామినేట్ చేసిందని శోభాశెట్టి చెప్పింది. షకీలా, కిరణ్ రాథోడ్‌లు వీక్‌గా ఉన్నారని చెప్పి వారిని నామినేట్ చేశాడు పల్లవి ప్రశాంత్. ప్రిన్స్, తేజను అమర్‌దీప్ నామినేట్ చేశాడు. ప్రశాంత్, శోభాశెట్టిని కిరణ్ రాథోడ్ నామినేట్ చేసింది. ప్రశాంత్, కిరణ్‌ను టేస్టీ తేజ నామినేట్ చేశాడు. ప్రియాంక, దామినిని రతిక నామినేట్ చేసింది. మొత్తం మీద ఈ వారం ఎనిమిది మంది నామినేషన్స్‌లో నిలిచారు.