బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ లో(Bigg Boss 7) అప్పుడే మూడో వారం నామినేషన్ల(Nominations) పర్వం కూడా ముగిసింది. మంగళవారం ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన విషయాలెన్నో జరిగాయి. నామినేషన్ల విషయాన్ని ఒకరినొకరు డిస్కస్‌ చేసుకున్నారు. తేజను రక్షించి అమర్‌దీప్‌ను ఎందుకు నామినేట్‌ చేయాల్సి వచ్చందో శోభాశెట్టికి సందీప్‌ వివరంగా చెప్పుకొచ్చాడు. లాస్ట్‌ వీక్‌ ప్రశాంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఈసారి అమర్‌ని అయితే తట్టుకోగలడని, తప్పనిసరిగా సేవ్‌ అవుతాడని సందీప్‌ తెలిపాడు. ఇక శివాజీతో(shivaji) చిట్‌చాట్‌ చేసిన రతిక(Rathika) తన బాధనంతా చెప్పుకున్నారు.

బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌ లో(Bigg Boss 7) అప్పుడే మూడో వారం నామినేషన్ల(Nominations) పర్వం కూడా ముగిసింది. మంగళవారం ఎపిసోడ్‌లో ఆసక్తికరమైన విషయాలెన్నో జరిగాయి. నామినేషన్ల విషయాన్ని ఒకరినొకరు డిస్కస్‌ చేసుకున్నారు. తేజను రక్షించి అమర్‌దీప్‌ను ఎందుకు నామినేట్‌ చేయాల్సి వచ్చందో శోభాశెట్టికి సందీప్‌ వివరంగా చెప్పుకొచ్చాడు. లాస్ట్‌ వీక్‌ ప్రశాంత్‌కు ఎక్కువ ఓట్లు పడ్డాయని, అందుకే ఈసారి అమర్‌ని అయితే తట్టుకోగలడని, తప్పనిసరిగా సేవ్‌ అవుతాడని సందీప్‌ తెలిపాడు. ఇక శివాజీతో(shivaji) చిట్‌చాట్‌ చేసిన రతిక(Rathika) తన బాధనంతా చెప్పుకున్నారు. తన మాజీ బాయ్‌ఫ్రెండ్‌ గురించి పరోక్షంగా మాట్లాడుతున్నారని, దీంతో తన మైండ్‌ ఆఫ్‌ అయిపోయిందని చెప్పారు.ఇక బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లందరూ కలిసి వినాయక చవితి పండుగను సంబరంగా జరుపుకున్నారు. పిండితో ముద్దలా చేసి, దానితో వినాయకుడి బొమ్మ చేసుకుని, ఆ విఘ్ననాయకుడికి పూజలు చేసి ప్రసాదం తిన్నారు. ఆ తర్వాత బిగ్‌బాస్‌ ఎంటరయ్యాడు. మూడో పవరస్త్ర కోసం తాను ముగ్గురిని ఎంపిక చేశానని పేర్కొంటూ అమర్‌దీప్‌, శోభాశెట్టి, ప్రిన్స్‌ యవర్‌ పేర్లు చెప్పాడు. దాంతో మిగతావారిలో కొంచెం అసంతృప్తి మొదలయ్యింది. ప్రశాంత్‌ అయితే ఏదో భూమి బద్దలైనట్టుగా ఫీలయ్యాడు. ఓడిపోయా, నేను ఓడిపోయా అంటూ గొణిగాడు. ప్రశాంత్‌ బాధపడుతున్నాడని తెలుసుకున్న బిగ్‌బాస్‌ అతడిని కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచాడు. పవరస్త్ర కోసం తాను ఎంపిక చేసిన ముగ్గురిలో అనర్హుడు అని అనిపించిన వారి పేరు చెప్పమన్నాడు. సందీప్‌, శివాజీతో పాటు సెలెక్ట్ అయిన ముగ్గురిని కాకుండా అందరినీ పిలిచి అనర్హులు అనిపించిన వారి పేరు, అభిప్రాయాలు చెప్పమన్నాడు. అలా బిగ్‌బాస్‌ ఫిట్టింగ్‌ పెట్టేశాడు. ఒకవైపు ఈ గేమ్ జరుగుతుండగానే శివాజీ గెలుచుకున్న పవరస్త్రని అమరదీప్ చోరీ చేశాడు. తర్వాత ఏమి తెలియనట్టు గమ్మున ఉండిపోయాడు. మరోవైపు పవరస్త్రను ప్రశాంత్‌ తీశాడేమోనని రతిక అతడితో గొడవ పెట్టుకుంది. మొదట సరదా కోసం గొడవ పడుతున్నారేమోననిపించింది కానీ తర్వాతర్వాత గొడవ ముదిరింది. అరచి గోలగోల చేసుకునేంతగా పెరిగింది. రతికను ప్రశాంత్‌ టచ్‌ చేస్తూ మాట్లాడటం కాస్త వింతగా అనిపించించింది. ఎవరు అనర్హులో ఏడుగురు కంటెస్టెంట్లు చెప్పిన వీడియోలను టీవీలో ప్లే చేశాడు బిగ్‌బాస్‌. మొదట యవర్‌ పేరు చెప్పిన వాళ్ల వీడియోలు ప్లే చేశాడు. ఈ క్రమంలోనే అతడు తేజతో గార్డెన్‌ ఏరియాలో గొడవ పెట్టుకున్నాడు. అక్కడితో ఈ ప్రహసనం ముగిసిపోలేదు. తనను తాను కంట్రోల్‌ చేసుకోలేకపోయిన యవర్‌ స్మోక్‌ రూమ్‌లోని బెంచ్‌పై ఉన్న గ్లాసును పదేపదే కొడుతూ, అందరినీ భయపెట్టాడు. మిగతా వారి సంగతేమో కానీ రతిక తనకు ఈ రేంజ్‌లో వెన్నుపోటు పొడుస్తుందని యవర్‌ ఊహించలేదు. ఇదే విషయాన్ని ఆమెతో చెబుతూ బాధపడ్డాడు కూడా!

Updated On 19 Sep 2023 11:57 PM GMT
Ehatv

Ehatv

Next Story