బిగ్‌బాస్‌ హౌస్‌లో(Bigg Boss House) గొడవలు ఎక్కువయ్యాయి. శుక్రవారం ఎపిసోడ్‌లో గౌతమ్‌(Gautham), సందీప్‌లతో(Sandeep) ప్రిన్స్‌ యవర్‌(Prince Yuvar) పెద్ద గొడవే జరిగింది. టాస్క్‌లో భాగంగా ప్రిన్స్‌ యవర్‌ దగ్గర ఉన్న భాగాన్ని తీసుకుని మహాబలి టీమ్‌ దాన్ని శివాజీ చేతిలో పెట్టింది. దీనికి ప్రిన్స్‌ అంగీకరించలేదు. తన పార్ట్‌ను అసలు ఇచ్చేది లేదని నానా గొడవ చేశాడు. ఒకానొక దశలో చాలా రెచ్చిపోయాడు. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్‌ గేమ్‌ అని చెప్పాడు. ఇ

బిగ్‌బాస్‌ హౌస్‌లో(Bigg Boss House) గొడవలు ఎక్కువయ్యాయి. శుక్రవారం ఎపిసోడ్‌లో గౌతమ్‌(Gautham), సందీప్‌లతో(Sandeep) ప్రిన్స్‌ యవర్‌(Prince Yuvar) పెద్ద గొడవే జరిగింది. టాస్క్‌లో భాగంగా ప్రిన్స్‌ యవర్‌ దగ్గర ఉన్న భాగాన్ని తీసుకుని మహాబలి టీమ్‌ దాన్ని శివాజీ చేతిలో పెట్టింది. దీనికి ప్రిన్స్‌ అంగీకరించలేదు. తన పార్ట్‌ను అసలు ఇచ్చేది లేదని నానా గొడవ చేశాడు. ఒకానొక దశలో చాలా రెచ్చిపోయాడు. తనకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదని, ఇది చాలా బ్యాడ్‌ గేమ్‌ అని చెప్పాడు. ఇచ్చేయ్ ఇచ్చేయ్ అంటూ తన భాగాన్ని విసిరేసి.. గౌతమ్ వైపు చూస్తూ అరిచాడు. గేటు తెరవండి, ఇంటికెళ్లిపోతా అని ఏడ్చాడు. మహబలి టీమ్‌లోని సభ్యులంతా కూడబలుక్కుని శివాజీ, షకీలాకు మాయా అస్త్ర భాగాలను ఇచ్చారని చెప్పుకున్నారు. కానీ అదే గ్రూపులో ఉన్న రతిక ఒక్కసారిగా గట్టిగట్టిగా అరుస్తూ మాట మార్చేసింది. తాను శివాజీ, ప్రిన్స్‌ అని చెబితే తన మాట అసలు వినలేదని సొంత టీమ్‌పైనే చాడీలు చెప్పింది. ఆడితే నిజాయితీగా ఆడండంటూ అరచి గోల పెట్టింది. రతిక అలా అనేసరికి ప్రశాంత్‌, గౌతమ్‌ ఆమెపై రెచ్చిపోయారు. ఇప్పుడు చెబితే ఎలా అంటూ ఆమెతో గొడవకు దిగారు. వారి కోపం చూస్తే ఆమెను కొడతారేమోనన్న అనుమానం వచ్చింది. టీమ్‌ మెంబర్స్‌తో రతిక గొడవపడుతున్నప్పుడు మధ్యలో ప్రిన్స్‌ వచ్చాడు. గౌతమి మొహం దగ్గర వరకు వచ్చి గట్టిగా అరిచాడు. ఇంగ్లీష్, హిందీలో మాటాడుతూ హౌస్ రూల్స్ ను ఇంకోసారి బ్రేక్‌ చేశాడు. బాడీ చుడూ అని ప్రిన్స్ అంటే అవి ఇంజెక్షన్స్‌తో తెచ్చుకున్నవే కదా అని గౌతమ్ సైగ చేశాడు. దీంతో యవర్ ఒళ్లు మండింది. పర్సనల్‌కి వెళ్లొద్దు అని ప్రిన్స్ కోపం కట్టలు తెచుకుంది. హౌసులో రాజకీయాలు ఎక్కువయ్యాయని రతిక గట్టిగా అరుస్తూ చెప్పింది. ఇక్కడందరూ ఫేక్ మనుషులు అని, వాళ్లతో ఉండలేనని యవర్ అన్నాడు. తన పార్ట్ లాగేసుకున్నారని, ఏకంగా సందీప్‌తోనూ గొడవపడ్డాడు. తనకు ఆన్సర్ కావాలని, లేకపోతే అప్పటివరకు మైక్ వేసుకోనని బిగ్‌బాస్‌కే వార్నింగ్ ఇచ్చేలా మాట్లాడాడు. యవర్‌ను అర్ధరాత్రి కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచాడు బిగ్‌బాస్‌.. జరిగిందంతా చెప్పమన్నాడు. యవర్‌ మొత్తం చెప్పేశాడు. మిమ్మల్ని బిగ్‌బాస్‌ చూస్తున్నాడని, బయట ప్రేక్షకులు కూడా గమనిస్తున్నారని చెప్పుకొచ్చాడు. గౌతమ్‌ సారీ చెప్పాలంటూ యవర్‌ అడిగాడు. అయితే అలా సారీలు చెప్పడం ఉండదని డైరెక్ట్‌గా బిగ్‌బాస్‌ చెప్పలేదు కానీ మీరు ఇక్కడికి గెలవడానికి వచ్చారని, మీరు ఇక బయటకు వెళ్లవచ్చని యవర్‌ను కూల్‌ చేశాడు బిగ్‌బాస్‌. అయితే గొడవ జరుగుతున్న సమయంలో మాట వదిలావు అని రతికకి షకీలా హితవు చెప్పింది. మొత్తం మీద రతిక సారీ చెప్పింది. షకీలా కాళ్లకు దండం పెట్టింది. మరోవైపు రెండో పవర్ అస్త్ర కోసం మరో పోటీదారుడ్ని ఎంచుకునే ఛాన్స్ ఇస్తున్నారు అని సందీప్‌తో బిగ్‌బాస్ చెప్పారు. దీంతో చాలాసేపు ఆలోచింది అతడు అమరదీప్ పేరు చెప్పాడు. అయితే పోటీకి ఇద్దరే ఫిక్స్ అయిన తర్వాత మరో వ్యక్తిని తీసుకురావడమేమిటని శివాజీ, షకీలాతో వాదన పెట్టుకున్నాడు. బిగ్‌బాస్ తీరు తనకు నచ్చట్లేదని, ప్లీజ్ నన్ను ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ వేడుకున్నాడు. రతికను ప్రేమిస్తున్నావా అంటూ యవర్‌ను ప్రశాంత్‌ అడిగినప్పుడు కొంచెం ఫీలింగ్స్‌ ఉన్నాయని చెప్పాడు. దానికి కొన్ని రజులు ఆగు నీకే తెలుస్తందని ప్రశాంత్‌ బదులిచ్చాడు. లవ్ వద్దని చెప్పాడు. రెండో పవర్ అస్త్ర కోసం గార్డెన్ ఏరియాలో ఉన్న ఓ చెవిలో గట్టిగా బిగ్ బాస్ అని మూడుసార్లు అరవాల్సి ఉంటుంది. ఎవరైతే పెద్దగా అరుస్తారో వాళ్లు విజయం సాధించినట్టు. కొంచెం గ్యాప్‌ తీసుకుని శివాజీ, అమర్‌దీప్‌, షకీలా తలో మూడు సార్లు గట్టిగా అరిచారు. ఈ గ్యాప్‌లో యవర్.. సందీప్‌తో గొడవపెట్టుకున్నాడు. సందీప్ చాలా ప్రశాంతంగా ఉండటంతో అక్కడికది ముగిసిపోయింది. ఇకపోతే రెండో పవర్ అస్త్రతోపాటు నాలుగు వారాల ఇమ్యూనిటీ గెలుచుకున్నది ఎవరో వీకెండ్‌లో నాగార్జున చెప్తారు, అప్పటివరకు వెయిట్ చేయండని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది.

Updated On 16 Sep 2023 2:36 AM GMT
Ehatv

Ehatv

Next Story