తనకుఎలాంటి ఆస్తులు లేవని... కనీసం సొంత ఇల్లు కూడా తన ఫ్యామిలీకి లేదు అని క్లారిటీ ఇచ్చింది.. సీరియల్ నటి ప్రియాంక జైన్(Priyanka Jain). బిగ్ బాస్ హౌస్(Bigg Boss) ఫైనల్ కు వస్తున్న నేపథ్యంలో.. ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తారు అంటూ.. కింగ్ నాగార్జున(Nagarjuna) హౌస్ లో ఉన్నవారిని అడిగారు.
తనకుఎలాంటి ఆస్తులు లేవని... కనీసం సొంత ఇల్లు కూడా తన ఫ్యామిలీకి లేదు అని క్లారిటీ ఇచ్చింది.. సీరియల్ నటి ప్రియాంక జైన్(Priyanka Jain). బిగ్ బాస్ హౌస్(Bigg Boss) ఫైనల్ కు వస్తున్న నేపథ్యంలో.. ప్రైజ్ మనీ గెలిస్తే ఏం చేస్తారు అంటూ.. కింగ్ నాగార్జున(Nagarjuna) హౌస్ లో ఉన్నవారిని అడిగారు. దాంతో ఒక్కొక్కరు ఒక్కోక్క రకంగా చెప్పగా.. ప్రియాంక స్పందించిన తీరు అందరిని ఆకర్షించింది.
బిగ్ బాస్ హౌస్ లో ప్రియాంక మొదటి నుంచి కూడా చాలా యాక్టివ్ గా దూసుకుపోతూ అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం టాప్ 5 సభ్యుల లిస్టులో ఆమె పేరు కూడా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రైజ్ మనీగా 50 లక్షలను గెలుచుకుంటే ఏం చేస్తారనే ప్రశ్నకి ఆమె తన మనసులోని మాటను బయటపెట్టింది.
ప్రియాంక మాట్లాడుతూ.. సార్ .. మా ఫాదర్ కి ఎలాంటి ప్రాపర్టీ(Property) లేదు. ఇల్లుగానీ .. షాప్ గాని లేదు. అటు అమ్మపేరు మీద గానీ .. ఇటు నాన్నపేరు మీద గాని ఎలాంటి ఆస్తులు లేవు గనుక, ఒక ఇల్లు తీసుకుని వాళ్లకి గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నాను" అంటూ నిజాయతీగా సమాధానమిచ్చింది. మరి ఈ సీజన్లో ఆ ప్రైజ్ మనీని ఎవరు అందుకుంటారనేది చూడాలి.
ప్రస్తుతం ప్రియాంక వరుసగా సీరియల్స్(Serials) చేస్తోంది. శివ అనే మరో సీరియల్ నటుడితో ప్రేమలో ఉన్న ఆమె.. సహజీవనం చేస్తోంది. త్వరలో వీరు పెళ్ళి కూడా చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. శివతో మౌనరాగం సీరియల్ లో నటించింది ప్రియాంక. ఇక ప్రస్తుతం హౌస్ లో ఉన్న అమర్(amardeep) తో కలిసి జానకి కలగనలేదు సీరియల్ లో నటిస్తోంది.