సీరియల్‌ నటిగా సుపరిచితమై ప్రియాంక(Priyanka).. బిగ్‌బాస్‌(Bigg Boss) సీజన్-7కు వెళ్లి మరింత పాపులరైంది. సీజన్‌ నడుస్తున్న సందర్బంగా తన జీవితంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పుకునేది. ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఓ సందర్భంగా ప్రైజ్‌ మనీ 50 లక్షలు నెగ్గితే ఏం చేస్తావని ప్రశ్నించగా.. తన తల్లికి ఇల్లు కొనిపెట్టాలని తన కోరికని చెప్పింది. షోలో టాస్క్‌ల్లో ఉత్సాహంగా పాల్గొనేది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తూ టాప్‌-5కి చేరింది.

సీరియల్‌ నటిగా సుపరిచితమై ప్రియాంక(Priyanka).. బిగ్‌బాస్‌(Bigg Boss) సీజన్-7కు వెళ్లి మరింత పాపులరైంది. సీజన్‌ నడుస్తున్న సందర్బంగా తన జీవితంలో చాలా కష్టాలు పడ్డానని చెప్పుకునేది. ఈ షో హోస్ట్ అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ఓ సందర్భంగా ప్రైజ్‌ మనీ 50 లక్షలు నెగ్గితే ఏం చేస్తావని ప్రశ్నించగా.. తన తల్లికి ఇల్లు కొనిపెట్టాలని తన కోరికని చెప్పింది. షోలో టాస్క్‌ల్లో ఉత్సాహంగా పాల్గొనేది. బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్‌లను పూర్తి చేస్తూ టాప్‌-5కి చేరింది. అంతేకాదు తన వంటలతో బిగ్‌బాస్‌ కంటెస్టులకు కొత్త కొత్త రుచులను పరిచయం చేసింది. సీజన్‌ 7 వంటలక్కగా ప్రియాంక పేరుతెచ్చుకుంది. అయితే తాజాగా తన యూట్యూబ్‌ చానెల్‌లో ఏడుస్తూ సంచలన విషయాలు వెల్లడించింది.

బిగ్‌ బాస్‌ షోకు వెళ్లడం నేను చేసిన పెద్ద తప్పని ఆమె తెలిపింది. తను షోలో ఉండగా తన తల్లి అనారోగ్యంపాలైందని తెలిపింది. తనను డిస్టర్బ్‌ చేయొద్దన్న ఉద్దేశంతో అమ్మ అనారోగ్యం గురించి తనకు చెప్పలేదు అంది. ఎంత బ్లీడింగ్‌ ఎక్కువున్నా ఓర్పుగా భరించిందే తప్ప.. తనకు తెలపలేదని.. బిగ్‌ బాస్‌ షోకు వెళ్లకుంటే దగ్గర ఉండి అమ్మకు ట్రీట్మెంట్‌ చేయించేదానిని అని ఏడుస్తూ చెప్పుకొచ్చింది. షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్‌ కోసం వెళ్తే వైద్యులు క్యాన్సర్‌ తొలి దశలో ఉన్నట్లు చెప్పారు. తను షోకు వెళ్లకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని.. నేను బయట ఉంటే సరైన సమయంలో చికిత్స చేయించేదానిని ఆవేదన చెందింది. అయితే యుటరస్‌(Uterus) తొలగిస్తే క్యాన్సర్‌(Cancer) నుంచి బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు అన్నారని ప్రియాంక తెలిపింది. విజయవంతంగా సర్జరీ చేయడంతో కాస్త ఊపిరి తీసుకున్నానని.. ఇక నుంచి అమ్మను దగ్గరుండి చూసుకుంటానని ప్రియాంక వీడియోలో చెప్పింది. తన తల్లికి చికిత్స జరిగి డిశ్చార్జి అయిన తర్వాత వీడియోను ప్రియాంక షేర్‌ చేసుకుంది.

Updated On 25 Jan 2024 4:44 AM GMT
Ehatv

Ehatv

Next Story