బిగ్‌బాస్‌ 7వ సీజన్‌(Bigg Boss Season 7) ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. షో ప్రారంభమయ్యి రెండు రోజులు కాలేదు అప్పుడే గొడవలు స్టార్టయ్యాయి. రెండో రోజు నామినేషన్స్‌ మొదలు పెట్టేసరికి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు 14 మంది ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ ఒక్కో వ్యక్తి తలో ఇద్దరిని నామినేట్‌(Nominate) చేశారు. అందుకు కారణాలు కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్లపై నామినేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఎనిమిది మందిలో ఎవరు బయటకు వెళతారనేది ఉత్కంఠగా మారింది.

బిగ్‌బాస్‌ 7వ సీజన్‌(Bigg Boss Season 7) ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటోంది. షో ప్రారంభమయ్యి రెండు రోజులు కాలేదు అప్పుడే గొడవలు స్టార్టయ్యాయి. రెండో రోజు నామినేషన్స్‌ మొదలు పెట్టేసరికి బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లు 14 మంది ఒకరిపై ఒకరు కౌంటర్లు వేసుకున్నారు. వారికి హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ ఒక్కో వ్యక్తి తలో ఇద్దరిని నామినేట్‌(Nominate) చేశారు. అందుకు కారణాలు కూడా చెప్పుకున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది కంటెస్టెంట్లపై నామినేషన్ కత్తి వేలాడుతోంది. ఈ ఎనిమిది మందిలో ఎవరు బయటకు వెళతారనేది ఉత్కంఠగా మారింది. అయితే ఈ వారం హౌస్‌ నుంచి వెళ్లిపోయేది మాత్రం ఓ లేడి కంటెస్టెంట్‌(Lady Contestant) అని అంటున్నారు. నాగార్జున హోస్ట్‌గా మొదలైన బిగ్‌బాస్‌ కొత్త సీజన్‌ నెమ్మదిగా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొదటి రోజు అందరూ సంతోషంగా కలిసిపోయి ముచ్చట్లు చెప్పుకున్నారు. నవ్వుకున్నారు. జోకులేసుకున్నారు. ఎప్పుడైతే నామినేషన్ల టాపిక్ వచ్చిందో అప్పట్నుంచి పూర్తిగా మారిపోయారు. ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ప్రస్తుతం శోభాశెట్టి(shobha Shetty), రతిక(Rithika), ప్రిన్స్‌(Prince), ప్రశాంత్‌(Prashanth), కిరణ్‌(Kiran), గౌతమ్‌(Gautham), షకీలా(shakeela), దామిని(Dhamini) నామినేషన్స్‌లో ఉన్నారని బిగ్‌బాస్‌ ప్రకటించారు. అయితే వీరిలో మొదటివారం ఎలిమినేట్‌ అయ్యేది ఎవరున్నది మాత్రం సస్పెన్స్‌గానే ఉంది. మరోవైపు నామినేషన్స్‌లో ఉన్నవారిని కాపాడేందుకు ఓటింగ్‌ కూడా జోరుగా సాగుతోంది. అయితే ఈ చిట్టాలో ఉన్న రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌కు ఎక్కువగా ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో శోభాశెట్టి, రతిక, గౌతమ్‌, షకీలా, ప్రిన్స్‌, దామిని ఉన్నారు. చిట్ట చివరి స్థానంలో కిరణ్‌ రాథోడ్‌(Kiran rathode) ఉన్నారు. కిరణ్‌కి ఉన్న లాంగ్వేజ్‌ ప్రాబ్లమ్‌ కారణంగా ఆమె అందరితోనూ ఎక్కువగా కలవలేకపోతున్నారు. మాట్లాడలేకపోతున్నారు. అలాగని కిరణ్‌ రాథోడే హౌస్‌ నుంచి వెళ్లిపోతారనుకోవడానికి లేదు. మరి ఈ వీకెండ్‌లో ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? కిరణ్‌ హౌస్‌ నుంచి వెళ్లిపోక తప్పదా? చూడాలి మరి!

Updated On 7 Sep 2023 1:14 AM GMT
Ehatv

Ehatv

Next Story