ప్రభాస్ ఫ్యాన్స్ కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. సలార్ సినిమాకు డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ ఫిట్ షోలకు పర్మిషన్ ఇచ్చింది.

Telangana government opens 1 am shows for ‘Salaar’
ప్రభాస్ ఫ్యాన్స్(Prabhas Fans) కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) గుడ్ న్యూస్(Good News) చెప్పింది. సలార్ సినిమా(Salaar Movie)కు డిసెంబర్ 21 అర్ధరాత్రి ఒంటి గంట నుంచే బెన్ ఫిట్ షో(Benefit Show)లకు పర్మిషన్ ఇచ్చింది. సలార్ సినిమా టికెట్ల ధరల విషయానికి వస్తే.. సింగిల్ థియేటర్లో టికెట్ రేట్ రూ.65 పెంచగా.. మల్టీప్లెక్స్లో టికెట్ ధర(Ticket Price)కు అదనంగా రూ.100 పెంచారు. ఏపీ ప్రభుత్వం 'సలార్' టికెట్ రేటును 40 రూపాయల వరకు పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. ఈ సినిమాలో మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఇదిలావుంటే.. భారతదేశం అంతటా సలార్ మిడ్ నైట్ షోలను భారీగా ప్లాన్ చేస్తున్నారు చిత్ర నిర్మాతలు. ఈ చిత్రంపై టీమ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఉంది. ఇండస్ట్రీ సర్కిల్‌ల నుండి కూడా సానుకూల నివేదికలు ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ నీల్ కూడా సలార్ ఔట్‌పుట్‌తో సంతృప్తి చెందానని ఇప్పటికే చెప్పాడు.
