నంద‌మూరి బాల‌కృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వ‌చ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్

నంద‌మూరి బాల‌కృష్ణ, బోయపాటి శ్రీను కాంబోలో వ‌చ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. భారీ బ్లాక్ బస్టర్స్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టింది. ఈ ఇద్ద‌రి క‌ల‌యిక‌లో మరో సినిమా ఉంటుందని, అదే 'అఖండ 2' అని ఊహాగానాలు వినిపిస్తూ రాగా.. జూన్ 10న బాల‌కృష్ణ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అధికారిక ప్రకటన వచ్చీయింది. బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లోని సినిమాను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లో రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా ప్రకటించారు. బీబీ4 వర్కింగ్ టైటిల్‌తో ఓ పోస్టర్ విడుద‌ల‌ చేస్తూ బాల‌కృష్ణకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియ‌జేశారు.

ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బాలకృష్ణ కుమార్తె తేజస్విని ఈ చిత్రాన్ని సమర్పిస్తారని, పోస్టర్‌పై అధికారికంగా వెల్లడించారు. తేజస్విని కూడా నిర్మాణ బాధ్యతలు చేపట్టబోతున్నారని తెలుస్తోంది. 2021లో విడుదలైన అఖండ దేశీయ మరియు విదేశీ మార్కెట్‌లలో అద్భుత ప్రదర్శన చేసింది. అఖండ OTT ప్రీమియర్ చేసిన తర్వాత మంచి ప్రశంసలను అందుకుంది. బాలకృష్ణ అఖండ, వీరసింహారెడ్డి, భగవంత కేసరి వంటి మూడు వరుస హిట్‌లతో మంచి ఊపు మీద ఉన్నారు.

Updated On 10 Jun 2024 11:37 PM GMT
Yagnik

Yagnik

Next Story