ఇంతకు ముందు కూడా నటులకు అభిమానులుండేవారు కానీ, మిగతావారిపట్ల దురాభిమానాన్ని కనబర్చేవారు కాదు.
ఇంతకు ముందు కూడా నటులకు అభిమానులుండేవారు కానీ, మిగతావారిపట్ల దురాభిమానాన్ని కనబర్చేవారు కాదు. మహా అయితే పోస్టర్ల మీద పేడ కొట్టేవారంతే! ఇప్పుడు దారుణంగా తయారయ్యారు. అందుకు ఒక కారణం కులం(Cast) అయితే, రెండో కారణం రాజకీయాలతో(Politics) సినిమాలు ముడిపడటం. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యిందంటే డే వన్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవాలి. చిన్నపాటి తేడా వచ్చినా ఆ సినిమాపై సోషల్ మీడియాలో ట్రోలింగ్(Social media trolling) మొదలవుతుంది. ఇష్టం వచ్చిన రాతలు రాసేసి పోస్టులు చేస్తుంటారు. ఇదంతా చేసేది రాజకీయ పార్టీలకు సంబంధించిన సోషల్ మీడియానే అంటే అశ్యర్యపోవాల్సిన పని లేదు. మరికొద్ది రోజులలో విడుదల కాబోతున్న పుష్ప 2(Pushpa-2) సినిమా ప్రస్తుతం విషమ పరిస్థితిని ఎదుర్కొంటున్నది. పుష్ప 2 సూపర్ హిట్టు కొడితే ఫర్వాలేదు. కానీ హిట్ అనే టాక్ వచ్చినా నెగటివ్ ప్రచారం చేయడానికి కాచుకుని ఉన్నారు చాలా మంది. తెలుగుదేశంపార్టీ(TDP), జనసేన(Janasena) పార్టీ రెండూ రెడీగా ఉన్నాయి. అందుకు కారణం ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడు మెగా శిబిరం కూడా పుష్ప 2 గురించి మాట్లాడటం లేదు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi), పవర్‌స్టార్ పవన్ కల్యాణ్(Pawan kalyan), మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్(Ram charan) ఫ్యాన్స్ కూడా పుష్ప 2 సినిమా టాక్ కోసం ఎదురుచూస్తున్నారు. మరి మహేశ్‌బాబు(Mahesh babu), ప్రభాస్(Prabhas) అభిమానులు ఏం చేస్తారో చూడాలి. ముందు జాగ్రత్తగా లేటెస్ట్‌గా స్ట్రీమింగ్ అవుతున్న అన్‌స్టాపబుల్ షోలో మహేశ్‌బాబు, ప్రభాస్‌లపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించారు. ఇందుకోసమైనా మహేశ్, ప్రభాస్ ఫ్యాన్స్ పుష్ప 2 పట్ల సాఫ్ట్ కార్నర్‌ను చూపిస్తారేమో చూడాలి!