నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందన్నది సామెత. అందుకే నోటిని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మాట తూలితే మాత్రం ఎదుటివారి నుంచి తిట్లు, శాపనార్థాలు తప్పవు. ఇందుకు లేటెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ తమ్మారెడ్డి భరద్వాజ. నిర్మాత దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడగలరు.
నోరు మంచిదైతే ఊరుమంచిదవుతుందన్నది సామెత. అందుకే నోటిని అదుపులో పెట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. మాట తూలితే మాత్రం ఎదుటివారి నుంచి తిట్లు, శాపనార్థాలు తప్పవు. ఇందుకు లేటెస్ట్ బెస్ట్ ఎగ్జాంపుల్ తమ్మారెడ్డి భరద్వాజ. నిర్మాత దర్శకుడైన తమ్మారెడ్డి భరద్వాజ ఏ విషయాన్ని అయినా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడగలరు. నిర్భయంగా తన అభిప్రాయాలను చెప్పగలరు. అందుకే మీడియా అటెన్షన్ ఎప్పుడూ ఆయనపైన ఉంటుంది. అయితే మొన్నీమధ్యన ఆయన ట్రిపులార్ ప్రమోషన్లు, వాటి కోసం అయిన ఖర్చుపై అనవసరంగా నోరు పారేసుకుని ఎన్టీఆర్, రామ్‌చరణ్ అభిమానులకు అడ్డంగా దొరికిపోయారు.. ఓ పక్కన ప్రపంచమంతా ట్రిపులార్ సందడిలో మునిగి తేలుతుంటే, జేమ్స్ కేమరూన్, స్పీల్ బర్గ్ వంటి కొమ్ములు తిరిగినవాళ్ళే ఆర్ ఆర్ ఆర్ దెబ్బకి గుమ్మైపోయి, మన వాళ్ళ ముందు పిల్లిమొగ్గలు వేస్తుంటే...మన యువ కథానాయకులు రామ్ చరణ్, .జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరినీ నెత్తిమీద పెట్టుకుంటుంటే....తగుదునమ్మా అని పని గట్టుకుని మరీ ట్రిబుల్ ఆర్ ప్రమోషన్స్ పేరిట 80 కోట్లు వ్యయం అయిందని, ఆ ఖర్చుతో చిన్న సినిమాలు చాలా తీయొచ్చని అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ ఆయనన్న మాటలు మాత్రం ఇద్దరు కథానాయకుల అభిమానులకు కోపం తెప్పించింది. దాంతో వాళ్ళు తమ్మారెడ్డి మీద తోక తొక్కిన నాగుపాముల్లా బుసలు కొడుతున్నారు.
వారి ఆగ్రహం సహేతుకమే! ట్రిపులార్ సినిమాను తీసిపారేయ్యడానికి లేదు. దేశ విదేశాల్లో ప్రముఖల ప్రశంసలను అందుకుంది. అంతర్జాతీయంగా ఆ సినిమా టెక్నిషియన్లకు సన్మానాలు, సత్కారాలు జరుగుతున్నాయి. ఇలాంటి టైమ్‌లో తమ్మారెడ్డి ఆ మాట అనుకుండా ఉండాల్సింది. అంత అనుభవం ఉన్న ఆయన సినిమా ప్రమోషన్‌లను చులకన చేస్తూ మాట్లాడారు. అంతే అటువైపు నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిపడుతున్నాయి. అనాలోచిత వ్యాఖ్యలు చేసే రామ్‌గోపాల్ వర్మ కూడా ట్రిపులార్ గురించి పల్లెత్తు మాట అనలేదు. అలాంటిది తమ్మారెడ్డి భరద్వాజ ఇలా అనడమేమిటని ఫిల్మ్‌నగర్ గుసగులలాడుతోంది. ఇకమీదటైనా ఆయన నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని ఎన్టీఆర్, చెర్రి అభిమానులు హెచ్చరిస్తున్నారు.