భోళా శంకర్‌(Bholashankar) సినిమాను చూసిన చాలా మందికి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఎందుకీ సినిమా చేశారా అన్న అనుమానం కలిగింది. సాధారణ ప్రేక్షకులకే కాదు, మెగా అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. కొందరు చిరంజీవికి సలహాలతో కూడిన ఘాటైన లేఖలు కూడా రాశారు. దర్శకుడు మెహర్‌ రమేశ్‌ను(Mehar ramesh) అయితే వదలకుండా తిట్టిపోస్తున్నారు. చిరంజీవి రీమేక్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని చాలా మంది భావన.

భోళా శంకర్‌(Bholashankar) సినిమాను చూసిన చాలా మందికి మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) ఎందుకీ సినిమా చేశారా అన్న అనుమానం కలిగింది. సాధారణ ప్రేక్షకులకే కాదు, మెగా అభిమానులకు కూడా ఈ సినిమా నచ్చలేదు. కొందరు చిరంజీవికి సలహాలతో కూడిన ఘాటైన లేఖలు కూడా రాశారు. దర్శకుడు మెహర్‌ రమేశ్‌ను(Mehar ramesh) అయితే వదలకుండా తిట్టిపోస్తున్నారు. చిరంజీవి రీమేక్‌ల జోలికి వెళ్లకపోవడమే ఉత్తమమని చాలా మంది భావన. ఇప్పుడు టాలీవుడ్‌ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ(Tammareddy Bharadhwaj) కూడా చిరంజీవి రీమేక్స్‌పై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్లు వైరల్‌ అవుతున్నాయి. 'అప్పట్లో సినిమా పరిశ్రమలోకి వచ్చిన వారికి పని తప్ప మరో ఆలోచన ఉండేది కాదు. ఇప్పటికీ అలాంటి వాళ్లు ఉన్నప్పటికీ దాన్ని వ్యాపారంగా చూసేవాళ్లు ఎక్కువైపోయారు. కథ చెప్పమని అడిగితే అప్పట్లో రైటర్స్ సూటిగా సుత్తిలేకుండా చెప్పేవారు. ఇప్పుడేమో 'ఓపెన్ చేస్తే' అని ఎలివేషన్స్ ఇస్తున్నారు. రైటర్స్ డైరెక్టర్స్ కావడం దీనికి కారణమై ఉండొచ్చు. ప్రేక్షకులకు పనికొచ్చే అంశం, అది కూడా నేచురల్‌గా ఉండాలి. ఇది పక్కనబెట్టి ఏదో చేస్తే సినిమాలు ఆడవు.

ఎన్టీఆర్, ఏఎన్నాఆర్, కృష్ణ, చిరంజీవి.. ఇలా హీరోలందరూ కెరీర్ ఆరంభంలో మెథడ్ యాక్టింగ్ చేసినట్లు ఉంటుంది. చిరంజీవినే తీసుకోండి. శుభలేఖ, స్వయంకృషి, రుద్రవీణ, విజేత వంటి సినిమాలకే అద్భుతమైన రెస్పాన్స్ దక్కింది. బాలీవుడ్‌ హీరో అమీర్‌ఖాన్‌(amirkhan) నటించిన దంగల్ లాంటి సినిమా చిరంజీవి చేసినా ప్రేక్షకులు చూస్తారు. భోళా శంకర్, గాడ్ ఫాదర్ లాంటివి చేసి డిసప్పాయింట్ కావడం కంటే నేచురల్ మూవీస్ చేస్తే బెటర్ అని నా అభిప్రాయం. అయితే ఇదే విషయాన్ని చిరంజీవితోనూ చెబుదామని ప్రయత్నించాను. కానీ ఎందుకో కుదరలేదు. ఒకప్పటి సినిమాల్లో చిరంజీవిని చూస్తే మన ఇంట్లో మనిషిలా కనిపించేవారు. ఇప్పుడు ఆ చిరంజీవి మళ్లీ కనిపిస్తే చూడాలని ఉంది. అలాంటి సినిమాలు తప్పకుండా ఆడతాయనేది నా నమ్మకం' అని తమ్మారెడ్డి అన్నారు. మరి చిరంజీవి ఈ సలహాలు సూచనలు పాటిస్తారా? రాబోయే సినిమాల విషయంలో ఏం చేస్తారు? మళ్లీ పాత రూట్‌లోనే వెళతారా? అన్నది చూడాలి.

Updated On 17 Aug 2023 5:23 AM GMT
Ehatv

Ehatv

Next Story