తమిళనాట సినిమా వాళ్లకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అందులోను ఈమధ్య విజయ్ దళపతికి(Vijay Thalapathy) ఎక్కువగా షాకులు తగులుతున్నాయి. ఈమధ్య పులి సినిమా విషయంలో ఇన్ కమ్ టాక్స్(Income tax) ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న విజయ్.. తాజాగా తన సినిమా విషయంలో ప్రభుత్వం నుంచి షాక్ తిన్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే..
తమిళనాట సినిమా వాళ్లకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. అందులోను ఈమధ్య విజయ్ దళపతికి(Vijay Thalapathy) ఎక్కువగా షాకులు తగులుతున్నాయి. ఈమధ్య పులి సినిమా విషయంలో ఇన్ కమ్ టాక్స్(Income tax) ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న విజయ్.. తాజాగా తన సినిమా విషయంలో ప్రభుత్వం నుంచి షాక్ తిన్నాడు. ఇంతకీ విషయం ఏంటంటే.. తమిళనాడులో సినీ అభిమానుల హంగామా కాస్త ఎక్కువనే చెప్పాలి. స్టార్ హీరోలకు లక్షలాది సంఖ్యలో ఉండే ఫాలోవర్లు కొత్త సినిమాల విడుదల సమయంలో తెగ సందడి చేస్తుంటారు. థియేటర్ల వద్ద పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంటారు.
మరీ మఖ్యంగా తమ అభిమాన హీరో సినిమాని అందరికంటే ముందుగానే చూసేయాలని తెగ ఆరాటపడుతుంటారు. అందుకే అభిమానుల కోసం ముందుగానే ఇప్పుడు స్పెషల్ షోలు వేస్తున్నారు కాబట్టి ఇంకా ముందుగా సినిమా చూసే అవకాశం సినీ అభిమానులకు దక్కుతోంది. తాజాగా తమిళ అభిమానులు దళపతి విజయ్ సినిమా కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తుండగా.. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్(Vijay) నటించిన లేటెస్ట్ మూవీ లియో రిలీజ్ కు రెడీ అవుతోంది.
ఇక ఈసినిమా విషయంలో తమిళనాడులోని విజయ్ ఫ్యాన్స్‌కి ముందుగానే ఈసినిమా చూసే అవకాశం లేకుండా పోయింది. ఫ్యాన్స్ అందరికీ తమిళ ప్రభుత్వం బ్యాడ్ న్యూస్ తో కూడిన ప్రకటన చేసింది గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న లియోకు ప్రత్యేక షోలు(Special Shows) ఏమీ లేవని తమిళనాడు ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక షోలు వేయాలంటూ అభిమానులు గొడవలకు దిగితే చర్యలు ఉంటాయని పోలీసులు హెచ్చరించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తమిళనాడు ప్రిన్సిపల్ సెక్రటరీ అముత పోలీసులకు ఆదేశాలిచ్చారు. థియేటర్ల వద్ద భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు.
హీరో విజయ్ ఫ్యాన్స్ థియేటర్ యజమానులతో గొడవలకు దిగితే చ్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు హీరో విజయ్ ఫ్యాన్స్‌కు ఒకింత నిరాశ కలిగించాయని చెప్పక తప్పదు. ఎందుకంటే అభిమాన హీరో సినిమా ముందుగానే చూసేయాలని ఎంతోమంది ఎదురుచూస్తున్నారు. ఆరు రోజులు ముందుగానే అడ్వాన్స్ టికెట్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. స్పెషల్ షోల కోసం వారంతా ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి తాజా పరిణామం విజయ్ ఫ్యాన్స్‌కి నిరాశ కలిగిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.