తమిళ సూపర్ స్టార్ ధనుష్ అంటే తెలుగు ఆడియన్స్‏లో తెలియనివాళ్లంటూ ఎవ్వరూ ఉండరు అనుకుంట. ధనుష్ రీసెంట్‏గా బైలింగ్వల్‏లో రిలీజైన సార్ (Sir) సినిమాలో కనిపించారు ధనుష్. అయితే ఆయన ఆ చిత్రంలో మాస్టారు.. మాస్టారు.. అనే పాట పాడి అందరినీ అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే.

తమిళ సూపర్ స్టార్ ధనుష్ అంటే తెలుగు ఆడియన్స్‏లో తెలియనివాళ్లంటూ ఎవ్వరూ ఉండరు అనుకుంట. ధనుష్ రీసెంట్‏గా బైలింగ్వల్‏లో రిలీజైన సార్ (Sir) సినిమాలో కనిపించారు ధనుష్. అయితే ఆయన ఆ చిత్రంలో మాస్టారు.. మాస్టారు.. అనే పాట పాడి అందరినీ అలరించిన సంగతి మనందరికీ తెలిసిందే. అదలా ఉంటే ఇప్పుడాయన మరో తెలుగు సినిమాకి పాట పాడబోతున్నారు. ఇక యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, సీనియర్ హీరోయిన్ అనుష్క శెట్టి కాంబినేషన్‏లో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (Miss Shetty Mr Polishetty) అనే కామిడి సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి మహేష్‏బాబు పి. దర్శకత్వం వహిస్తున్నాడు.

తాజాగా ఈ చిత్రం నుంచి కొత్త సాంగ్ ‘హతవిధి ఏందిది’ (Hathavidi Endidi) అనే పాట రాబోతోంది. ఈ పాటను సూపర్ స్టార్ ధనుష్ పాడారు. ఈ పాట లిరిక్స్‏ను రామజోగయ్య శాస్త్రి, మ్యూజిక్ రధన్ అందించారు. సాంగ్ రిలీజ్ అనౌన్స్‏మెంట్ డేట్‏ను తెలియజేస్తూ ఓ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ వీడియోలో హీరో పాటపాడాలని నవీన్ పొలిశెట్టి ఇటు దర్శకుడిని అటు నిర్మాతను, లిరిసిస్టును ఒప్పించే ప్రయత్నాలు కామెడీగా చూపించారు. తీరా డబ్బింగ్ రూమ్‏లోకి వచ్చాక.. పాట పాడే ప్రయత్నం చేస్తుండగా.. ధనుష్ (Dhanush) గతంలో పాడిన పాటలను వినిపిస్తూ.. ఈ పాటను ధనుష్ పాడినట్టు ఆడియన్స్‏కు హింట్ ఇచ్చారు మేకర్స్. ధనుష్ పాడిన ఈ పాట మే 31న మీ ముందుకొస్తుందంటూ ఫైనల్ అనౌన్స్‏మెంట్ ఇచ్చారు చిత్ర బృందం.

Updated On 28 May 2023 12:51 AM GMT
Ehatv

Ehatv

Next Story