ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన 2898 ఏడీ (Kalki 2898 AD)సూపర్ డూపర్ హిట్టయింది.
ప్రభాస్(Prabhas) హీరోగా వచ్చిన 2898 ఏడీ (Kalki 2898 AD)సూపర్ డూపర్ హిట్టయింది. అమితాబ్‌బచ్చన్(Amitabh Bachchan), కమలహాసన్(Kamal Haasan), దీపికా పడుకొనే(Deepika padukone) వంటి అగ్రతారలు కూడా ఇందులో నటించారు. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించిన చలసాని అశ్వనీదత్‌కు(Ashwin dutt) లాభాలను తెచ్చిపెట్టింది. నాగ్ అశ్విన్(Nag ashwin) దర్శకత్వం వహించిన ఈ సినిమా ఇప్పటి వరకు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే అశ్వనీదత్‌పై తమిళ సీనియర్ నటుడు రాధారవి(Radha ravi) సంచలన ఆరోపణ చేశారు. లేటెస్ట్‌గా ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఏమన్నారంటే కులం చూసి తనను సినిమాలో రిజెక్ట్ చేశాడని అన్నారు. 'వెంకటేశ్, కుష్బూ హీరో హీరోయిన్లుగా వచ్చిన చిత్రం కలియుగ పాండవులు సినిమా సమయంలో నేను వైజాగ్‌లో ఉన్నాను. నన్ను సినిమాల్లో బుక్ చేసుకోవడానికి అశ్వనీదత్ వచ్చాడు. నేను అప్పుడు అశ్వనీదత్‌కు ఒక్కటే చెప్పాను. నాకు తెలుగులో కె. రాఘవేంద్ర రావు (K.Raghavendra Rao) మాత్రమే తెలుసు అతను ఏం చెబితే అదే ఫైనల్ అని చెప్పాను. అయితే నన్ను బుక్ చేయమని అశ్వనీదత్ తన అసిస్టెంట్‌కు చెప్పాడు. అది చెబుతూ.. మీ కాస్ట్ ఏంటి అని అడిగాడు. నేను నాకు సరిగ్గా తెలియదు బలిజ నాయుడు కావచ్చు అన్నాను. దీంతో అది విన్న అశ్వనీదత్ ఏం మాట్లాడకుండా వెళ్లిపోతూ తన బ్యానర్‌లో ఉన్న నా సినిమాలు అన్ని క్యాన్సిల్ చేయమన్నాడు. దీనికి కారణం అడిగితే చెప్పకుండా వెళ్లాడు. ఇదంతా చూసిన రాఘవేంద్రరావు రియాక్టవుతూ అతడికి ఏం అయ్యింది? ఎందుకు క్యాన్సిల్ చేశాడు? అని అడిగాడు. నాకు తెలియదు సార్ అని అన్నాను' అంటూ రాధారవి తెలిపాడు.