ఖమ్మంలో కాంగ్రెస్ జనగర్జన సభ ప్రారంభమైంది. కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు భారీగా సభకు హాజరయ్యారు. మరికొద్దిసేపట్లో రాహుల్ గాంధీ కూడా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఇదిలావుంటే.. సభకు హాజరయ్యేందుకు ప్రజా యుద్ధ నౌక గద్దర్ ఖమ్మం వచ్చారు.
తమిళనాట నిర్మాతలు సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్టుతెలుస్తోంది. స్టార్ హీరో ధనుష్ (Danush) కు రెడ్ కార్డ్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. కోలీవుడ్ లోధనుష్ ను బ్యాన్ చేయబోతున్నారా..? కారణం ఏంటి..? తరువాత పరిణామాలు ఏంటీ..?
సౌత్ లో స్టార్ హీరోగా ఎదిగాడు ధనుష్. వారసత్వంగా సినిమాల్లోకి వచ్చినా.. సొంత టాలెంట్ తో.. స్టార్ హీరో ఇమేజ్ సాధించాడు. మామ రజనీకాంత్ సూపర్ స్టార్ అయినా.. ఆయన పేరు వాడకుండా.. తనకంటూ ఓఇమేజ్ సాధించాడు ధనుష్. ఇక ఈ క్రమంలో తమిళంతో పాటు తెలుగులో కూడా డబ్బింగ్ సినిమాలతోనే స్టార్ ఇమేజ్ సాధించాడు ధనుష్. అంతే కాదు తెలుగులో మార్కెట్ తో పాటు.. ఇక్కడ ప్రత్యేకంగా ఫ్యాన్స్ బేస్ ను సాధించాడు.
ఇక తాజాగా సార్ సినిమాతో డైరెక్ట్ తెలుగు ఎంట్రీ ఇచ్చాడు ధనుష్. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తూ..హడావిడి చేస్తున్నాడు. ఈక్రమంలో తమిళనాట ధనుష్ ను బ్యాన్ చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ధనుష్ ను బ్యాన్ చేయాలి అనుకోవడం ఏంటీ..? అసలు కారణం ఏంటీ అని అంతా ఆలోచిస్తున్నారు జనాలు. అసలు ఏం జరిగిందంటే..?
ధనుష్ ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ తేండ్రళ్ ఫిల్మ్స్ నిర్మాణంలో ఓ సినిమాలో నటిస్తానని మాట ఇచ్చాడట. ఇందుకోసం అడ్వాన్స్ కూడా తీసుకున్నాడట. డబ్బులు తీసుకుని చాలా కాలం అవుతున్నా.. సినిమా మాత్రం చేయడంలేదు. అప్పటి నుంచి అడుగుతున్నా.. ఇప్పటి వరకు సినిమా మాత్రం చేయలేదు. దీంతో సదరు నిర్మాణ సంస్థ తమిళ నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేసింది.
ఈ పిర్యాదుతో.. ధనుష్ పై చర్యలు తీసుకోవడం కోసం తమిళ నిర్మాతల మండలి రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. నిర్మాతను మోసం చేసినందుకు గాను.. ధనుష్‌కు రెడ్ కార్డ్ జారీ చేసే ఆలోచనలో నిర్మాతల మండలి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.ఇదే జరిగితే.. తమిళనాట ఈ విషయం సంచలనంగా మారుతుంది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ అవుతుంది.