తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. తెలుగు సినిమాలకు కూడా తనదైన శైలిలో సంగీతం అందిస్తూ ఇక్కడి వారికి దగ్గరయ్యారు అనిరుధ్. మ్యూజిక్ వరల్డ్‌లో అనిరుధ్ అనేదు పేరు కాదు బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన నుంచి పాటల్లో ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్ అయ్యాయి. వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి(Why this Kolevari di) అనే పాటతో సరిగ్గా పదేళ్ల కిందట ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనిరుధ్.

Anirudh Ravichandar
తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్(Anirudh Ravichandar) తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచతమే. తెలుగు సినిమాలకు కూడా తనదైన శైలిలో సంగీతం అందిస్తూ ఇక్కడి వారికి దగ్గరయ్యారు అనిరుధ్. మ్యూజిక్ వరల్డ్‌లో అనిరుధ్ అనేదు పేరు కాదు బ్రాండ్ అంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన నుంచి పాటల్లో ఎక్కువ శాతం బ్లాక్ బస్టర్ అయ్యాయి. వై దిస్ కొలవెరి కొలవెరి కొలవెరి డి(Why this Kolevari di) అనే పాటతో సరిగ్గా పదేళ్ల కిందట ఎంట్రీ ఇచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు అనిరుధ్. తనకు 20 ఏళ్ల వయసులోనే మ్యూజిక్ వరల్డ్‌లోకి వచ్చి సీనియర్లకే గట్టిపోటి ఇచ్చాడు. తెలుగులో అజ్ఞాతవాసి(Agnathavasi) చిత్రంతో పరిచయమయ్యాడు. ఆ సినిమా హిట్ కాకపోయిన అనిరుధ్ మ్యూజిక్ మాత్రం ఇప్పటికి వినిపిస్తూనే ఉంది. ఇప్పుడు దేవర(Devara) సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. అయితే సంగీత దర్శకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్న అనిరుధ్ రవిచందర్ ఇండస్ట్రీలోని హీరోయిన్లతో రిలేషన్స్‌లో ఉన్నాడనే వార్తలు తరచుగా వినిపిస్తుంటాయి.
అప్పట్లో కోలీవుడ్‌లో సుచీ లీక్స్ పేరుతో పలు ఫోటోలో కూడా బయటకు వచ్చాయి. హీరోయిన్ ఆండ్రియాను(Andrea) అనిరుధ్ గాఢమైన ముద్దు పెట్టుకుంటున్న ఫోటో(Kiss Photos) అప్పట్లో వైరల్ అయ్యింది. ఒక రకంగా అది సినీ పరిశ్రమలో పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు మళ్లీ ఆయన వార్తల్లోకి ఎక్కారు. బీస్ట్ సినిమాలో అరబిక్ కుత్తు పాట పాడి గుర్తింపు తెచ్చుకున్న గాయని జోనితా గాంధీతో(Jonita Gandhi) అనిరుధ్ ఎఫైర్(Affairs) నడుపుతున్నట్లు తమిళ పరిశ్రమలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్నిరోజులుగా వారిద్దరూ కలిసే తిరుగుతున్నారని చెప్పుకుంటున్నారు. కమలహాసన్(Kamal Hassan ) విక్రమ్(Vikram) సినిమా నుంచే వీరిద్దరూ ప్రేమలో పడిపోయారని తెలుస్తోంది. త‍్వరలో పెళ్లి కూడా చేసుకోబోతున్నారని అంటున్నారు. అందుకే అనిరుధ్ ఎక్కడ ఉంటే జోనితా గాంధీ కూడా అక్కడే కనిపిస్తున్నారట. సోషల్ మీడియాలో, ప్రధాన మీడియాలో ఇన్నేసి వార్తలు వస్తున్నా వీరు మాత్రం వాటిని ఖండించడం లేదు. అలాగని అవునని కూడా చెప్పడం లేదు.
