సినీ ఇండస్ట్రీలో పెళ్లికాని ప్రసాద్‌లు చాలా మందే ఉన్నారు. ఈ బ్యాచ్‌కు కెప్టెన్‌ సల్మాన్‌ ఖాన్‌(Salman Khan).. మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ ఆయనే! బాలీవుడ్‌కు సల్మాన్‌ ఉన్నట్టు మనకు ప్రభాస్‌(Prabhas) ఉన్నాడు. కోలీవుడ్‌కు స్టార్‌ హీరో విశాల్‌(Vishal) ఉన్నాడు. ప్రస్తుతం రత్నం(Ratnam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్‌. సింగం సిరీస్‌ సినిమాల దర్శకుడు హరి ఈ సినిమాను రూపొందించాడు.

సినీ ఇండస్ట్రీలో పెళ్లికాని ప్రసాద్‌లు చాలా మందే ఉన్నారు. ఈ బ్యాచ్‌కు కెప్టెన్‌ సల్మాన్‌ ఖాన్‌(Salman Khan).. మోస్ట్‌ ఎలిజబుల్ బ్యాచ్‌లర్‌ ఆయనే! బాలీవుడ్‌కు సల్మాన్‌ ఉన్నట్టు మనకు ప్రభాస్‌(Prabhas) ఉన్నాడు. కోలీవుడ్‌కు స్టార్‌ హీరో విశాల్‌(Vishal) ఉన్నాడు. ప్రస్తుతం రత్నం(Ratnam) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విశాల్‌. సింగం సిరీస్‌ సినిమాల దర్శకుడు హరి ఈ సినిమాను రూపొందించాడు. ఇందులో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్‌లతో విశాల్ బిజీగా ఉన్నాడు. హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించాడు. మీరు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నవ్వుతూనే జవాబిచ్చాడు విశాల్‌. ప్రభాస్‌ పెళ్లి కాగానే తప్పకుండా చేసుకుంటానని ఆన్సరిచ్చాడు. అంతే కాదు, తన ఫస్ట్‌ ఇన్విటేషన్‌ కార్డు ప్రభాస్‌కే ఇస్తానని విశాల్‌ చెప్పాడు. గతంలో ఓసారి ఇదే ప్రశ్నను విశాల్‌ను అడిగితే తమిళ నిర్మాతల నడిగర్‌ సంఘం భవన నిర్మాణం పూర్తికాగానే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు విశాల్‌. ఇప్పుడు మళ్లీ పెళ్లి ప్రస్తావన వచ్చేసరికి ప్రభాస్‌ పెళ్లితో ముడిపెట్టాడు. మొత్తం మీద విశాల్‌ చేసిన కామెంట్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Updated On 18 April 2024 1:17 AM GMT
Ehatv

Ehatv

Next Story