విజయకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్(Discharged) అయి ఇంటికి చేరుకున్నారు. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం..శ్వాస కోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ ప్రస్తుతానికి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.కాగా అదృష్టవశాత్తూ ఆయన తిరిగి కోలుకున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

హాస్పిటల్ లో సీరియస్ కండీషన్ వరకూ వెళ్ళి తిరిగి కోలుకున్నాడు తమిళ స్టార్ సీనియర్ హీరో కెప్టెన్ విజయ్ కాంత్(Captain Vijay Kanth).

విజయకాంత్ అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ఆయన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్(Discharged) అయి ఇంటికి చేరుకున్నారు. తమిళ మీడియా వర్గాల కథనాల ప్రకారం..శ్వాస కోస సంబంధిత సమస్యతో బాధపడుతున్న విజయకాంత్ ప్రస్తుతానికి కోలుకుని ఇంటికి చేరుకున్నారు.కాగా అదృష్టవశాత్తూ ఆయన తిరిగి కోలుకున్నారని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా ఆనందం వ్యక్తం చేస్తూ పోస్ట్ లు పెడుతున్నారు.

చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు తమిళ నటుడు DMDk అధినేత విజయ్ కాంత్. చాలా సార్లు ఆయనకు సీరియస్ అయ్యింది.. ప్రాణాపాయం నుంచి బయట పడ్డారు. ఇక గత కొంత కాలంగా ఇంటికే పరిమితం అయిన విజయ్ కాంత్.. నడవడానికి కూడా వీలు లేకపోవడంతో.. వీల్ చైర్(Wheel Chair) కే పరిమితం అయ్యారు. ఈక్రమంలో ఆయన మరోసారి అనారోగ్యం బాధించడంతో హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. రెండురోజుల్లోవస్తారు అనుకుంటే.. మయత్ హాస్పిటల్ లో దాదాపు 20 రోజులకుపైగా ఆయనకు ట్రీట్మెంట్ అందించారువైద్యులు.

ఈ క్రమంలో విజయకాంత్ పరిస్థితి విషమంగా ఉంది అని వార్త బయటకు వచ్చింది. దాంతో అసలు విజయ్ కాంత్ చనిపోయారనే ప్రచారం మొదలైంది సోషల్ మీడియాలో(Social media). జలుబు, జ్వరంతో హాస్పిటల్ లో చేరిన ఆయన..సాయంత్రం కల్లా డిశ్చార్జ్ అవుతారు అనుకుంటే.. దాదాపు 20 రోజులుగా హాస్పిటల్ లోనే ఉన్నారు. దాంతో విజయ్ కాంత్ చనిపోయారని వందంతులువ్యాపించాయి. ఈ నేపథ్యంలో ఆయన భార్య ప్రేమలత ఈ విషయంలో స్పందిచారు... కెప్టెన్ విజయ్ బాగున్నారని చెప్పారు. ఆయన చనిపోలేదని... తప్పుడు వార్తలను నమ్మొద్దని కోరారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని... త్వరలోనే ఆయన పూర్తిగా కోలుకుని బయటకు వస్తారని చెప్పారు. అంతే కాదు కెప్టెన్ ఫోటోను కూడా రిలీజ్ చేసింది.

Updated On 12 Dec 2023 7:50 AM GMT
Ehatv

Ehatv

Next Story