సోషల్‌ మీడియా(Social media) లేని రోజుల్లో కూడా పనిగట్టుకుని కొందరిపై దుష్ప్రచారం చేసేది మీడియా. కొందరు లైట్‌ తీసుకుంటారు. కొందరేమో చిటపటలాడిపోతారు. మరికొందరు కోపాన్ని, బాధను మనసులోనే దాచుకుంటారు. మీకు మోహన్‌(Mohan) అనే హీరో గుర్తున్నాడా? పాపం అతడి మీద కూడా అప్పట్లో కారుకూతలన్నీ కూశారు. అతడికి ఎయిడ్స్‌(AIDS) సోకిందని పుకార్లు పుట్టించారు. మోహన్‌ను వివరణ అడగాలన్న సోయి కూడా లేకుండా కొందరు వార్తలు రాశారు.

సోషల్‌ మీడియా(Social media) లేని రోజుల్లో కూడా పనిగట్టుకుని కొందరిపై దుష్ప్రచారం చేసేది మీడియా. కొందరు లైట్‌ తీసుకుంటారు. కొందరేమో చిటపటలాడిపోతారు. మరికొందరు కోపాన్ని, బాధను మనసులోనే దాచుకుంటారు. మీకు మోహన్‌(Mohan) అనే హీరో గుర్తున్నాడా? పాపం అతడి మీద కూడా అప్పట్లో కారుకూతలన్నీ కూశారు. అతడికి ఎయిడ్స్‌(AIDS) సోకిందని పుకార్లు పుట్టించారు. మోహన్‌ను వివరణ అడగాలన్న సోయి కూడా లేకుండా కొందరు వార్తలు రాశారు. ఇంచుమించు మూడు దశాబ్దాల తర్వాత మోహన్‌ ఆ రూమర్లపై స్పందించాడు. 'తొమ్మిదో దశకంలో నేను సినిమాలకు దూరమయ్యాను. అప్పుడే నాకు ఎయిడ్స్‌ అని ప్రచారం చేశారు. ఈ వార్త అభిమానులకు ఆందోళన కలిగించింది. నా ఫ్యామిలీ కూడా ఇబ్బంది పడింది. కానీ ఆ టైమ్‌లో నాకు అండగా ఉన్నది, నాలో ధైర్యాన్ని నింపింది నా కుటుంబమే. నాకు ఎయిడ్స్‌ లేదని మీడియాకు వివరణ ఇవ్వమని ఓ జర్నలిస్టు నాకు సలహా ఇచ్చాడు. నేను అందుకు అంగీకరించలేదు. ఈ వదంతులను పుట్టించిందే మీడియా. వాళ్లంతట వాళ్లే తప్పుడు వార్తలు రాశామని బహిరంగంగా చెప్పాలని మొండిగా వ్యవహరించాను. పనికిమాలిన పుకార్ల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావించాను. ఆ సమయంలో నా భార్య, కుటుంబం నాకు అండగా నిలబడింది' అని మోహన్‌ అన్నాడు. 1980లో మూడు అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు మోహన్‌. రెండో సినిమా నెంజతై కిల్లాదే (తెలుగులో మౌనగీతం) ఘన విజయం సాధించింది. ఈ సినిమాకు మూడు నేషనల్‌ అవార్డులు కూడా వచ్చాయి. అతడికి సిల్వర్‌ జూబ్లీ హీరో అనే పేరు కూడా వచ్చేసింది. తెలుగులో తూర్పు వెళ్లే రైలు, స్రవంతి, ఆనంతరాగాలు, ఆలాపన, చూపులు కలిసిన శుభవేళ, అబ్బాయితో అమ్మాయి వంటి సినిమాల్లో నటించాడు మోహన్‌. లేటెస్ట్‌గా హర అనే తమిళ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చాడు.

Updated On 8 Jun 2024 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story