తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన తమిళ నటుడు జయం రవి(Jayam ravi) సంచలన ప్రకటన చేశాడు.
తెలుగు సినీ ప్రేక్షకులకు కూడా సుపరిచితమైన తమిళ నటుడు జయం రవి(Jayam ravi) సంచలన ప్రకటన చేశాడు. భార్యతో(Wife) విడాకులు(Divorce) తీసుకున్నానని చెప్పాడు. కొన్ని రోజులుగా రవి- ఆర్తి(Arthi) దంపతులు విడిపోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఇవాళ అదే విషయాన్ని జయం రవి ఖరారు చేశారు. ఇష్ట పూర్వకంగానే విడాకులు తీసుకుంటున్నట్టు రవి చెప్పారు.
ఈ మేరకు ఎక్స్‌లో(Twitter) ఓ సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు'జీవితం ఎన్నో అధ్యాయాలతో నిండిన ప్రయాణం. ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. మీలో చాలామంది నన్ను ఆదరించి నాకు మద్దతుగా నిలిచారు. అందుకే నేను సదా నా అభిమానులతో, మీడియాతో పారదర్శకంగా, నిజాయతీగా ఉంటాను. నేడు మీ అందరితో ఓ వ్యక్తిగత విషయాన్ని పంచుకుంటున్నా. ఈ విషయాన్ని భారమైన హృదయంతో మీకు చెప్పాల్సి వస్తున్నది ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం. మాతో పాటు మా కుటుంబసభ్యుల గోప్యతను గౌరవించాలని మీ అందరినీ కోరుతున్నాను. ఈవిషయంపై వదంతులు, ఆరోపణలు మానేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఇది పూర్తిగా మా వ్యక్తిగత విషయం. సినిమాల్లో నటిస్తూనే ఉంటాను. మీ అందరికీ వినోదాన్ని పంచడం కోసం కష్టపడతాను. ఎప్పటికీ మీ జయం రవిగా మీ గుండెల్లో ఉంటాను. నన్ను ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఎప్పటికీ ఇలానే మద్దతిస్తారని ఆశిస్తున్నాను' అని జయం రవి తెలిపారు. 2009లో రవి, ఆర్తిని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలుగులో సూపర్ హిట్ అయిన జయం సినిమాలను తమిళంలో రవి హీరోగా రీమేక్ చేశారు. అది కూడా మంచి విజయాన్ని సాధించింది. అప్పటి నుంచి ఆయన పేరు జయం రవిగా మారిపోయింది.