సినీ లవర్స్‏కి పరిచయం అక్కర్లేని దర్శకుడు వెట్రిమార్(Vetrimaaran). దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా ఐదు జాతీయ అవార్డులు అందుకున్నారు ఆయన. పొల్లాదవన్(Polladhavan) నుంచి విసారణై, వడ చెన్నై, కోడి, అసురన్ వంటి సినిమాలతో కోలీవుడ్ తన ఇంపాక్ట్ ఏంటో చూపించాడు. రీసెంట్‏గా వెంట్రిమారన్ తీసిన విడుదలై (Viduthalai) చిత్రంలో సూరి, విజయ్ సేతుపతి మెయిన్ క్యారెక్టర్స్ చేసిన పార్ట్-1 మార్చి 31న వరల్డ్ వైడ్‏గా రిలీజ్ అయింది. ఈ సినిమాకు విమర్శకులు నుంచి ఫ్యాన్స్ వరకు పాజిటివ్ రివ్యూలను అందుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో ఏప్రిల్ 15న రిలీజ్ చేయాలని ఆ మూవీ టీమ్ భావిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్‏కు మంచి రెస్పాన్స్ ఒస్తోంది.

అయితే హైదరాబాద్‏లో విడుదలై పార్ట్-1(Viduthalai Part1)ను తెలుగులో విడుదల పార్ట్1 పేరుతో స్క్రీనింగ్ వేశారు. ఈ సందర్భంగా ప్రెస్‏మీట్‏లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్‏కు డైరెక్టర్ వెట్రిమారన్ సమాధానాలు ఇచ్చారు. ప్రెస్‏మీట్‏లో చాలా వరకు తక్కువ ప్రశ్నలకు మాత్రమే వెట్రిమారన్ సమాధానాలు ఇచ్చారు. అయితే జూనియర్ ఎన్టీఆర్‏తో సినిమాతో చేస్తున్నారా అన్న ప్రశ్నకు ఆయన రిప్లై ఇచ్చారు. అసురన్ (Asuran) చిత్రం తర్వాత అంటే లాక్‏డౌన్ తర్వాత ఎన్టీఆర్‏ను కలిశానన్నారు. ఎన్టీఆర్‏తో సినిమా చేయడానికి కొంత సమయం పడుతుందని.. ఒక సినిమా కంప్లీట్ చేసి మరో సినిమాకు వెళ్లడానికి టైమ్ పడుతుందని ఆయన చెప్పారు.

ఇదిలా ఉండగా ఫస్ట్ ఎవరితో సినిమా చేస్తారు.. జూనియర్ ఎన్టీఆర్(Jr NTR)‏తోనా అల్లు అర్జున్ (Allu Arjun)తోనా అంటే.. అది సమయం వచ్చిన్నప్పుడు చెప్తానని అన్నారు. అయితే ఎన్టీఆర్‏ను కలవకముందే అల్లు అర్జున్, మహేష్ బాబు (Mahesh Babu)ని కలిసినట్టు చెప్పారు వెట్రిమారన్. ఆడుకాలం (Aadukalam) తర్వాత బన్నీని కలిసినట్టు.. తమిళంలో సినిమా చేయాలనుకుంటున్నట్టు.. నాకు ఆసక్తి ఉంటే కథ చెప్పమని అడిగారన్నారు. అప్పుడు తాను రాసుకున్న వడ చెన్నై (Vada Chennai)లో ఒక పవర్ ఫుల్ రోల్ గురించి బన్నీకి చెప్పానని.. అది ఎందుకో కుదర్లేదు అని చెప్పారు.

ఇక ఆ తర్వాత తెలుగు వెర్షన్‏లో రిలీజ్ చేయబోతున్న విడుదల పార్ట్-1 (Vidudala Part-1) గురించి చెప్తూ... రైలు బాంబు దాడి తర్వాత పీపుల్స్ ఆర్మీ నాయకుడు వాతియార్ పెరుమాళ్ (విజయ్ సేతుపతి)ను ట్రాప్ చేయడానికి పోలీసులు ఆపరేషన్ ఘోస్ట్‏హంట్ ప్రారంభిస్తారని చెప్పారు. ఇందులో ఒక నిజాయితీ గల కానిస్టేబుల్ కుమరేశన్, ఒక డ్రైవర్గా ఆ దళంలో చేరతాడని.. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెరపై చూడాల్సిందేనని వెట్రిమారన్ తెలిపారు.

ఇక ఈ చిత్రంలో భవానీ శ్రీ, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రాజీవ్ మీనన్, ఇలవరసు, చేతన్, మున్నార్ రమేష్, బాలాజీ శక్తివేల్, శరవణ సుబ్బయ్య నటించారు. వెట్రిమారన్ నెక్ట్స్ ప్రాజెక్ట్ వాడివాసల్ చిత్రం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి.

Updated On 12 April 2023 4:52 AM GMT
Ehatv

Ehatv

Next Story