తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్ట్ చేసిన 7/G రెయిన్‏బో కాలనీ (7G Rainbow Colony) సినిమా అక్కడ మంచి హిట్‏ను సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని 2004 సంవత్సరంలో తెలుగులో 7/G బృందావన కాలనీ (7G Brindavan Colony) పేరుతో రిలీజ్ చేయడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

తమిళ డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selvaraghavan) డైరెక్ట్ చేసిన 7/G రెయిన్‏బో కాలనీ (7G Rainbow Colony) సినిమా అక్కడ మంచి హిట్‏ను సొంతం చేసుకుంది. ఆ చిత్రాన్ని 2004 సంవత్సరంలో తెలుగులో 7/G బృందావన కాలనీ (7G Brindavan Colony) పేరుతో రిలీజ్ చేయడంతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. బాక్సాఫీసు దగ్గర కాసుల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమాకు సీక్వెల్ రాబోతుందని ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ రొమాంటిక్ లవ్ డ్రామాకు పార్ట్ 2 ఉంటుందని గతంలోనే ఆ చిత్ర నిర్మాత ఏఎం రత్నం (A.M.Rathnam) తెలిపారు. దీంతో ఈ సినిమా షూటింగ్ జూన్‏లో ఉంటుందని బజ్ క్రియేట్ అయింది. 7/G బృందావన కాలనీలో సినిమాలో నటించిన రవి కృష్ణ (Ravi Krishna) ఇప్పుడు తీయబోయే సీక్వెల్‏లో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నారట. తెలుగులో వచ్చిన 7/G కాలనీ సినిమాలో రవి కృష్ణ సరసన సోనియా అగర్వాల్ (Sonia Agarwal) నటించింది.

ఈ సినిమాలో సీన్స్ అన్నీ కూడా చాలా న్యాచురల్‏గా ఉండటంతో ఈ చిత్రం యూత్‏ను బాగా ఆకట్టుకుంది. మరోవైపు ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించడంతో సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఈ చిత్రం తర్వాత రవికృష్ణ (Ravi Krishna) పెయిర్ మళ్లీ రిపీట్ చేసినా కూడా పెద్దగా ఆదరణలేకుండా పోయింది. దీంతో వీరిద్దరి కాంబోలో సినిమాలు రావడం ఆగిపోయింది. సోనియా అగర్వాల్ (Sonia Agarwal) మాత్రం కొన్ని చిత్రాలు చేస్తూనే వస్తోంది. 7/G బృందావన కాలనీ (7G Brindavan Colony) సినిమా బ్లాక్ బస్టర్ అవడంతో ఆ డైరెక్టర్‏తో హీరోయిన్ ప్రేమలో పడింది. వీళ్లిద్దరు 2006లో లవ్ మ్యారేజ్ చేసుకోగా.. కొన్ని కారణాల వలన 2010లో వివాహ బంధానికి చెక్ పెట్టేశారు. ఆ తర్వాత మెంటల్‏గా చాలా డిజప్పాయింట్ అయ్యానని.. అదే టైమ్‏లో నా జీవితంలో గీతాంజలి రావడంతో తన జీవితంలో చాలా మార్పు వచ్చిందని.. ప్రస్తుతం ఇద్దరం సంతోషమైన జీవితం గడుపుతున్నామని రీసెంట్‏గా డైరెక్టర్ సెల్వ రాఘవన్ (Selvaraghavan) చెప్పుకొచ్చారు.

Updated On 26 April 2023 4:11 AM GMT
Ehatv

Ehatv

Next Story