కొన్ని సినిమాలు(Movies) ఎందుకు విజయం సాధిస్తాయో అర్థం కాదు. ఆడిన ప్రతీ సినిమా అందరికీ నచ్చాలన్న రూలేమీ లేదు. ఆడని సినిమా బాగోలేదని కాదు. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. యానిమల్(Animal) సినిమా బ్లాక్‌బస్టర్ సాధించింది. సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయ్యింది.
కొన్ని సినిమాలు(Movies) ఎందుకు విజయం సాధిస్తాయో అర్థం కాదు. ఆడిన ప్రతీ సినిమా అందరికీ నచ్చాలన్న రూలేమీ లేదు. ఆడని సినిమా బాగోలేదని కాదు. ఒక్కొక్కరిది ఒక్కో అభిరుచి. యానిమల్(Animal) సినిమా బ్లాక్‌బస్టర్ సాధించింది. సందీప్‌రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వం వహించిన ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అయ్యింది. అదే సమయంలో ఈ సినిమాపై అనేకానేక విమర్శలు కూడా వచ్చాయి. మొన్నామధ్య ప్రముఖ కవి జావెద్ అక్తర్(Javed Akhtar) ఈ సినిమాపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. లేటెస్ట్‌గా తమిళ హీరో, దర్శకుడు ఆర్జే బాలాజీ(RJ Balaji) కూడా యానిమల్ సినిమాపై విమర్శలు గుప్పించాడు. ఆ సినిమాను థియేటర్‌లో తాను చూడలేదని, చూడాలనుకోవడం లేదని చెబుతూ చాలా మంది ఈ సినిమా చూడమని, అద్భుతంగా ఉందని సలహా ఇచ్చారని అన్నాడు. తనకు నచ్చిన అంశమేమిటంటే ఒకమ్మాయిని కొడుతుంటే తనను వేధిస్తుంటే థియేటర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారని, అది తాను సహించలేనని బాలాజీ చెప్పుకొచ్చాడు. అలాంటి సీన్లు ఎక్కువగా ఉన్న ఈ చిత్రాన్ని చూస్తూ ప్రజలు ఎంజాయ్ చేస్తుంటే తనకు బాధగా అనిపించిందని తెలిపాడు. అలాంటి సన్నివేశాలను చూసి ఆనందించడం సరైనది కాదన్నారు. ఇవి ప్రజలను ఏదో రకంగా ప్రేరేపిస్తాయని చెప్పాడు. అలాంటి సన్నివేశాలు తన సినిమాలో అయితే పెట్టనివ్వనన్నాడు. 'యానిమల్‌లో హీరో.. తృప్తి డిమ్రిని(Tripti Dimri) తన షూ నాకమన్నాడట. యూత్ ఇలాంటివి చూసినప్పుడు ఆడవాళ్లతో అలాంటి పనులు చేయించడం తప్పేం కాదని ఫీలవుతారు' అని ఆర్జే బాలాజీ అన్నాడు.