హీరో బాలకృష్ణ(Balakrishna) గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నేరుగా పేరు ప్రస్తావించకుండా బాలకృష్ణ ఆగడాలను బయటపెట్టారు నటీమణులు. ఇందులో పాతతరం హీరోయిన్లు కూడా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన వారిని కూడా కొట్టేస్తాడు. తన ముందు ఎవరైనా నిల్చున్నా వెనుకముందు చూడకుండా చెంప చెళ్లుమనిపిస్తారు. ఇలాంటి వీడియోలు నెట్టింట బోల్డన్ని ఉన్నాయి.
హీరో బాలకృష్ణ(Balakrishna) గురించి చాలా మంది చాలా రకాలుగా చెప్పారు. నేరుగా పేరు ప్రస్తావించకుండా బాలకృష్ణ ఆగడాలను బయటపెట్టారు నటీమణులు. ఇందులో పాతతరం హీరోయిన్లు కూడా ఉండటం గమనార్హం. ఎందుకంటే ఆయన ప్రవర్తన అలా ఉంటుంది కాబట్టి. సెల్ఫీ తీసుకోవడానికి వచ్చిన వారిని కూడా కొట్టేస్తాడు. తన ముందు ఎవరైనా నిల్చున్నా వెనుకముందు చూడకుండా చెంప చెళ్లుమనిపిస్తారు. ఇలాంటి వీడియోలు నెట్టింట బోల్డన్ని ఉన్నాయి. అన్నట్టు బాలయ్య బాబు సెట్‌లోనూ ఇలాగే బిహేవ్ చేస్తారట! ఈ మాటన్నది ప్రముఖ డైరెక్టర్ కాబట్టి నమ్మాల్సిందే! ప్రముఖ తమిళ దర్శకుడు కె.ఎస్.రవికుమార్(K. S. Ravikumar) ఖాతాలో చాలా హిట్స్ ఉన్నాయి. రజనీకాంత్(Rajinikanth), కమలహాసన్‌కు(Kamal haasan) పెద్ద పెద్ద హిట్లు ఇచ్చారు. బాలయ్యతో కూడా జైసింహ, రూలర్ అనే సినిమాలు తీశారు. కాకపోతే రెండు సినిమాలు అట్టర్‌ఫ్లాప్ అయ్యాయి. షూటింగ్ టైమ్‌లో ఎవరు నవ్వినా బాలకృష్ణ తట్టుకోలేడట! ఒకానొక టైమ్‌లో రవికుమార్ అసిస్టెంట్ డైరెక్టర్‌ని కూడా కొట్టడానికి రెడీ అయిపోయాడట! లేటెస్ట్‌గా గార్డియన్(Gardian) అనే తమిళ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడుతూ బాలకృష్ణ బిహేవియర్ గురించి చెప్పారు రవికుమార్.షూటింగ్‌లో ఎవరైనా నవ్వుతున్నట్లు కనిపిస్తే తట్టుకోలేడని, తనని చూసి నవ్వుతున్నారని అనుకుంటాడని, వెంటనే అతడికి కోపం వచ్చేస్తుందని రవికుమార్ చెప్పారు. ఆ నవ్వుతున్న వ్యక్తిని పిలిచి కొడతాడన్నారు. 'అలా ఓ సినిమా షూటింగ్ చేస్తున్న సమయంలోఅసిస్టెంట్ డైరెక్టర్ శరవణన్‌ని(Saravanan) ఫ్యాన్ తిప్పమని చెప్పాను. అతడు అనుకోకుండా బాలకృష్ణ వైపు ఫ్యాన్ తిప్పాడు. దీంతో ఆయన విగ్గు కాస్త అటు ఇటు ఊగింది. అది చూసి శవరణన్‌కు నవ్వు వచ్చింది. చిన్నగా నవ్వాడు. అది చూడగానే బాలకృష్ణకు వెంటనే కోపం వచ్చేసింది. ఎందుకు నవ్వుతున్నావ్ అని గట్టిగా అరిచాడు. శరవణన్‌ని బాలకృష్ణ ఎక్కడ కొడతాడో అని నేనే వెళ్లి.. సర్ అతడు మన అసిస్టెంట్ డైరెక్టర్ అని సర్ది చెప్పాను. అయినా సరే బాలయ్య నెమ్మదించలేదు. వెంటనే నోరు మూసుకుని ఇక్కడి నుంచి వెళ్లిపో అని శరవణన్‌కి అరిచి చెప్పాను. అప్పుడు బాలకృష్ణ కాస్త స్థిమిత పడ్డాడు' అని కె.ఎస్.రవికుమార్ చెప్పుకొచ్చాడు. ఈ విషయం చెబుతున్నంతసేపు స్టేజీపైన ఉన్న హీరోయిన్ హన్సికతో పాటు మిగతా వాళ్లందరూ నవ్వుతూనే ఉన్నారు. చివరగా మనిషి మంచోడే కానీ ఇలాంటి అనుమానపు ధోరణులు ఎక్కువ అని ముగించారు రవికుమార్.