డ్రగ్స్ కేసులో(Drugs Case) జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ(NIA) నుంచి తనకు నోటీసులు వచ్చాయనే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar) అన్నారు. సోషల్ మీడియాతో(Social Media) ఇందుకు సంబంధించిన సుదీర్ఘ వివరణను వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇచ్చుకున్నారు. 'ఆదిలింగం అనే వ్యక్తి నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పని చేసిన మాట నిజమే! సుమారు మూడేళ్ల కిందట అతడు నా దగ్గర పని చేశాడు. తర్వాత అతడు ఎక్కడ పని చేస్తున్నాడో నాకు తెలియదు. ప్రస్తుతం అతడితో ఎలాంటి కమ్యూనికేషన్ కూడా లేదు. మీడియాలో ప్రచారమవుతున్న వార్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది.
డ్రగ్స్ కేసులో(Drugs Case) జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్‌ఐఏ(NIA) నుంచి తనకు నోటీసులు వచ్చాయనే వార్తలలో ఏ మాత్రం నిజం లేదని తమిళ నటి వరలక్ష్మీ శరత్‌కుమార్(Varalakshmi Sarathkumar) అన్నారు. సోషల్ మీడియాతో(Social Media) ఇందుకు సంబంధించిన సుదీర్ఘ వివరణను వరలక్ష్మీ శరత్‌కుమార్ ఇచ్చుకున్నారు. 'ఆదిలింగం అనే వ్యక్తి నా దగ్గర ఫ్రీలాన్స్ మేనేజర్‌గా పని చేసిన మాట నిజమే! సుమారు మూడేళ్ల కిందట అతడు నా దగ్గర పని చేశాడు. తర్వాత అతడు ఎక్కడ పని చేస్తున్నాడో నాకు తెలియదు. ప్రస్తుతం అతడితో ఎలాంటి కమ్యూనికేషన్ కూడా లేదు. మీడియాలో ప్రచారమవుతున్న వార్త నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. నాకు ఎన్‌ఐఏ ఎలాంటి సమన్లు ఇవ్వలేదు. ఈ కేసుకు సంబంధించి అవసరమైతే అధికారులకు తప్పకుండా సహకరిస్తాను' అని వరలక్ష్మి తెలిపారు. అసలు ఆదిలింగం ఎవరు? ఎలా దొరికాడు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం! 2020 మార్చిలో కేరళలోని విల్లించాం తీర ప్రాంతంలో కేరళ తీర రక్షక దళం ఓ చిన్న పడవను అడ్డగించింది. తర్వాత పోలీసులు సోదాలు చేసి 300 కిలోల డ్రగ్స్, ఏకే 47 రైఫిళ్లు, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారు. 14వ వ్యక్తిగా చెన్నైలోని సెలైయూర్ ప్రాంతానికి చెందిన ఆదిలింగంను ఎన్‌ఐఏ అధికారులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారిస్తే గతంలో నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ సహాయకుడిగా పనిచేసేవాడని తెలిసింది. ఈ క్రమంలోనే వరలక్ష్మికి దీంతో ఏమైనా సంబంధం ఉందా అన్న అనుమానాలు అధికారులకు వచ్చాయి. దీంతో ఆమెను విచారణకు పిలవాలనే ఆలోచనలో అధికారులు ఉన్నారట! భారత ప్రభుత్వం నిషేధించిన ఎల్‌టిటిఈకి నిధులను సమకూర్చడానికే ఆదిలింగం బృందం ఈ పని చేస్తున్నట్టు ఎన్‌ఐఏ అధికారులు గుర్తించారు. ఇదే కేసులో 2021, ఆగస్టులో చెన్నైలోని వలసరవక్‌లో ఎల్‌టిటిఈ ఉద్యమానికి సహాయం చేస్తున్న సబేసన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తున్న ఇద్దరు శ్రీలంక తమిళులను విల్లించం బీచ్ ప్రాంతంలో అరెస్టు చేశారు. వారిలో అరెస్టు అయిన డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠా నాయకుడు గుణశేఖరన్‌తో ఆదిలింగం టచ్‌లో ఉన్నాడని తేలింది. దీంతో లేటెస్ట్‌గా ఆదిలింగంను అరెస్ట్ చేశారు. మదురైకి చెందిన ఆదిలింగం ఆర్మీలో పని చేసి స్చ్ఛంద పదవీ విరమణ చేశాడు. డ్రగ్స్ ట్రాఫికింగ్ ముఠా నాయకుడైన గుణశేఖరన్‌కు ఆదిలింగం సర్రోగేట్‌గా వ్యవహరించాడని, డ్రగ్స్, ఆయుధాల రవాణా ద్వారా వచ్చిన మొత్తాన్ని క్రిప్టో కరెన్సీలో, ఆది లింగం రాజకీయ పార్టీ, సినిమాల్లో పెట్టుబడిగా పెట్టాడని విచారణలో తేలింది. ప్రస్తుతం జైల్లో ఉన్న ఆదిలింగంను మరో వారం రోజుల్లో ఎన్‌ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించబోతున్నారు.