నోరుందికదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అందుకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ప్రముఖ తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఎస్‌.వి.శేఖర్‌కు(S.V sekar) ఇదే జరిగింది. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు ఆయనకు నెల రోజుల జైలుశిక్ష(Jail), 15 వేల రూపాయల జరిమానా(Penalty) విధిస్తూ ప్రత్యేక కోర్టు(Special court) సోమవారం తీర్పు చెప్పింది. 2018లో ఎస్‌.వి.శేఖర్‌ సోషల్ మీడియాలో(Social media) ఓ పోస్టు పెట్టాడు

నోరుందికదాని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే అందుకు ఫలితం అనుభవించాల్సి వస్తుంది. ప్రముఖ తమిళ సినీ నటుడు, రాజకీయ నాయకుడు ఎస్‌.వి.శేఖర్‌కు(S.V sekar) ఇదే జరిగింది. మహిళా జర్నలిస్టును ఉద్దేశించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడినందుకు ఆయనకు నెల రోజుల జైలుశిక్ష(Jail), 15 వేల రూపాయల జరిమానా(Penalty) విధిస్తూ ప్రత్యేక కోర్టు(Special court) సోమవారం తీర్పు చెప్పింది. 2018లో ఎస్‌.వి.శేఖర్‌ సోషల్ మీడియాలో(Social media) ఓ పోస్టు పెట్టాడు. ఆ పోస్టు వివాదాస్పదమయ్యింది. ఆయన చేసిన కామెంట్లు చాలా మందిని బాధించాయి. మహిళా జర్నలిస్టును(Female journalist) ఉద్దేశించి ఆయన నీచమైన కామెంట్‌ చేశారు. తమిళనాడులోని(Tamilnadu) మహిళా జర్నలిస్టులందరూ తమ ఉద్యోగాల కోసం ఉన్నతాధికారులతో వ్యక్తిగత సంబంధాలు పెట్టుకుంటున్నారని వ్యాఖ్యానిస్తూ ఓ పోస్ట్‌ పెట్టాడు. అప్పట్లో దీనిపై పెద్ద ఎత్తున వివాదం రేగింది. చైన్నె మీడియా ప్రతినిధులు పోలీసులకు కంప్లయింట్‌ చేశారు. మహిళా జర్నలిస్టులకు వ్యతిరేకంగానే ఆయన నోరు జారినట్టు విచారణలో తేలింది. తర్వాత ఎస్‌.వి.శేఖర్‌ సారీ చెప్పారు. అయినా కేసు మాత్రం కొనసాగుతూ వచ్చింది. ఈ కేసును రద్దు చేయాలని హైకోర్టును(High court) కూడా శేఖర్‌ ఆశ్రయించారు. అలా ఎలా కుదురుతుంది, విచారణను ఎదుర్కోవాల్సిందేనంటూ హైకోర్టు తెలిపింది. దీంతో ఈ కేసు చైన్నె కలెక్టరేట్‌ ఆవరణలోని ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జయవేల్‌ విచారిస్తూ వచ్చారు. వాదనలు ముగియడంతో సోమవారం తీర్పు చెప్పారు. ఎస్‌.వి.శేఖర్‌కు నెల రోజులు జైలు శిక్షతో పాటు 15 వేల రూపాయల జరిమానా విధించారు. అప్పీల్‌కు అవకాశం కల్పించాలని శేఖర్‌ తరపున న్యాయవాదులు జడ్జీకి విన్నవించుకున్నారు. ఇందుకు అవకాశం కల్పిస్తూ తాత్కాలికంగా శిక్షను నిలుపుదల చేస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. అప్పీల్‌ కోసం రెండు నుంచి నాలుగు వారాలలోపు ప్రయత్నాలు చేసుకోవాలని, ఆ తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా సంబంధిత కోర్టులో లొంగి పోవాలని ఆదేశాలిచ్చారు.

Updated On 19 Feb 2024 11:58 PM GMT
Ehatv

Ehatv

Next Story