మెగాస్టార్ చిరంజీవి జాలి, దయ గురించి టాలీవుడ్‏లో అందరికీ తెలుసు. ఒకప్పుడు ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారికి చిరంజీవి ఎందుకు సాయం చేస్తున్నారని ఓవైపు అభిమానులు ఫీలవుతున్నారు. ఆయన్ని ఇబ్బందులు పెట్టినవారికి సైతం తన వంతు సాయం చేస్తాడు మన చిరంజీవి. అంతటి గొప్ప మనసు ఆయనది. చిరంజీవి ఆర్థికంగా, కెరీర్‏పరంగా, ఆరోగ్యపరంగా ఎంతోమందికి సహాయం చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

చిరంజీవి చేసిన దానం గురించి మరో ఇన్సిడెంట్ బయటికొచ్చింది. పొన్నంబలం ఈయన తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. చిరంజీవి నటించిన ‘ఘరానా మొగుడు’ సినిమాలో ఫైట్ సీన్‏లో మెప్పించడంతో పాటు ఎంతో మంది స్టార్స్‏తో నటించి మెప్పించారు ఆయన. అయితే పొన్నంబలం ఏడాదిగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ చికిత్స తీసుకుంటున్నారు.

తన మెడికల్ ట్రీట్‏మెంట్ కోసం తన స్నేహితులను, సినీ పరిశ్రమలోని సహచరులను మెడికల్ ఖర్చులను కోసం పొన్నంబలం సహాయం కోరాడు. ఆర్థిక సాయం కోసం చిరంజీవివి అడిగితే ఆయన హామీ ఇచ్చారట. ఈ విషయాన్ని పొన్నంబలం ఓ ఇంటర్య్వూలో రివీల్ చేశారు. కిడ్నీ సర్జరీ నుంచి కోలుకున్న తర్వాత ఆయన ఈ విధంగా చెప్పుకొచ్చారు. చిరంజీవి తనను పెద్దన్నగా భావించేవారని అన్నారు.

రెండేళ్ల క్రితం కిడ్నీ సమస్య వచ్చింది. ఎవరైనా సాయం చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అప్పుడే నాకు చిరంజీవిగారు గుర్తుకు వచ్చారు. నా ఫ్రెండ్ ద్వారా ఆ నెంబర్ తీసుకుని నా అనారోగ్యం గురించి మెసేజ్ చేశాను. వెంటనే ఫోన్ రిసీవ్ చేసుకుని హైదరాబాద్ ఎప్పుడు వెళ్లొచ్చు అని అడిగాను. అప్పుడు చిరంజీవి గారు నన్ను చెన్నైలోని అపోలో ఆస్పత్రికి వెళ్లమని చెప్పారు. నేను అక్కడికి వెళ్లాను.. కాకపోతే అప్పటికే అక్కడ ఒకతను ఉండి.. నాకు ఎలాంటి ఎంట్రీ ఫీజు అడగకుండా.. లోపలికి పంపించారు. 40 లక్షల రూపాయలతో నాకు పూర్తిగా చికిత్స చేశారు. వాళ్లు నన్ను ఒక్క రూపాయి కూడా అడగలేదు.. అన్నీ చిరంజీవిగారే చూసుకున్నారు.

పొన్నంబలం భావోద్వేనికి గురై.. చిరంజీవిని సాయం అడిగితే లక్షో.. లేదా రెండు లక్షలో ఇస్తారని అనుకున్నానని అన్నాడు. కానీ 40 లక్షల ట్రీట్‏మెంట్ చేపిస్తారని అనుకోలేదన్నాడు. చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు అని పొన్నంబలం తెలిపారు. ఎంతో మందిని ఆదుకుని కాపాడిన సందర్భాలు ఉన్నాయి కాబట్టే ఆయన మన గుండెల్లో నిజమైన మెగాస్టార్‏గా ఇప్పటికీ ఉన్నారు.

Updated On 16 March 2023 1:57 AM GMT
Ehatv

Ehatv

Next Story