తమిళ నాట విలక్షణ నటుడిగా మంచి పేరు ఉంది జయం రవికి. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది తమిళనాట. తాజాగా జయం రవి డిఫరెంట్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో అవి హాట్ కామెంట్స్ గా మారాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు జయం రవి. ఈసినిమా పార్ట్ 1 కంటే కాస్త బటర్ గా అనిపించింది. ఈసినిమాలో స్టార్ కాస్ట్ ఉండటంతో.. వారి ఫ్యాన్స్ నుంచి ఈసినిమాకు భారీప్లోటింగ్ ఉంది.

తమిళ నాట విలక్షణ నటుడిగా మంచి పేరు ఉంది జయం రవి(Jayam Ravi)కి. ఆయనకంటూ సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ఉంది తమిళనాట. తాజాగా జయం రవి డిఫరెంట్ కామెంట్స్ చేశాడు. ఇండస్ట్రీలో అవి హాట్ కామెంట్స్ గా మారాయి.

రీసెంట్ గా రిలీజ్ అయిన పొన్నియిన్ సెల్వన్ 2(PS2) సినిమాతో ఆడియన్స్ ముందుకు వచ్చాడు జయం రవి. ఈసినిమా పార్ట్ 1 కంటే కాస్త బటర్ గా అనిపించింది. ఈసినిమాలో స్టార్ కాస్ట్ ఉండటంతో.. వారి ఫ్యాన్స్ నుంచి ఈసినిమాకు భారీ ప్లోటింగ్ ఉంది. ఇప్పటికే 200 కోట్ల కలెక్షన్స్ ను దాటి పరుగులు తీస్తోంది మూవీ. ఇక తాజాగా ఈసినిమాలో నటించి జయం రవి.. ఓ ఇంటర్వ్యూలో పాల్గొని.. ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుడి రిలీజ్ అయిన సంగతి తెలిసిందే..? అయితే ఈ రెండు సినిమాలకోసం దాదాపుగా అందరం ఐదేళ్లు శ్రమ పడ్డామన్నారు. ఈ సినిమా కోసం పెద్ద పెద్ద స్టార్స్ అంతా కలిసి నటించడం చాలా సంతోషంగా ఉందన్నారు రవి. ఇక షూటింగ్ టైమ్ ఎంత సీరియస్ గా చేశామో.. అంత సందడి వాతావరణం ఉండేదని.. ఎన్నోవిషయాలు తమ దగ్గర చర్చకు వచ్చేయవని ఆయన వెల్లడించారు. ఇంత పెద్ద సినిమాలో.. ఇంత మంది స్టార్స్ కలిసి నటించడం.. పదే పదే సాధ్యం కాదు అన్నారు.

ఇక ఇలా భారీ సినిమాలలో నటించిన తర్వాత మీరు నటించే చిన్న సినిమాలను ఆడియన్స్ ఆక్సప్ట్ చేస్తారా..? ఆరకంగా మీకు నమ్మకం ఉందా అని ప్రశ్నించగా..? జయం రవి డిఫరెంట్ గా స్పందించారు. రోజూ బిర్యానీ తినలేం కదా.. కొన్ని రోజులు తింటే బోరు కొండుతుంది. పప్పన్నం,సాంబార్ అన్నం తినక తప్పదు. అలాగే ఇలాంటి భారీ సినిమాలు అప్పుడప్పుడు చూస్తేనే బాగుంటుంది. అలానే చిన్న సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులను అలరిస్తాయి.. ఎప్పుడు భారీ సినిమాలు చేయలేం కదా అన్నారు.

అంతే కాదు పొన్నియిన్ సెల్వన్ తరహా సినిమాలు అరుదుగా మాత్రమే వస్తాయని అన్నారు రవి. తన తరువాతి సినిమాల ఫలలితాల విషయంలో ఏమాత్రం టెన్షన్ పడటంలేదన్నారు జయం రవి. తాను నటించిన ఇరైవన్ సినిమా త్వరలో రిలీజ్ కు సిద్ధంగా ఉందని జయం రవి కామెంట్లు చేశారు. సైరన్ అనే మూవీలో డ్యూయల్ రోల్ చేస్తున్నానని జయం రవి చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో తండ్రీ కొడుకుల పాత్రల్లో కనిపిస్తానని తండ్రి రోల్ కోసం సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో కనిపిస్తానని జయం రవి చెప్పారు. అంతే కాదు త్వరలో దర్శకుడిగా మారబోతున్నట్టు వెల్లడించారు రవి. కార్తి హీరోగా తాను సినిమా తెరకెక్కిస్తున్నట్టుతెలిపారు.

Updated On 2 May 2023 7:15 AM GMT
Ehatv

Ehatv

Next Story