లస్ట్‌ స్టోరీస్‌-2, జీ కర్దా వెబ్‌ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒక్కసారిగా న్యూస్‌ మేకర్‌ అయ్యారు. ఆ ప్రాజెక్టులలో నటించినందుకు ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు తమన్నా. ఈ వెబ్‌ సిరీస్‌లో తమన్నా లిప్‌లాక్‌ సీన్‌పై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు.

లస్ట్‌ స్టోరీస్‌-2, జీ కర్దా వెబ్‌ సిరీస్‌లో మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ఒక్కసారిగా న్యూస్‌ మేకర్‌ అయ్యారు. ఆ ప్రాజెక్టులలో నటించినందుకు ప్రస్తుతం సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు తమన్నా. ఈ వెబ్‌ సిరీస్‌లో తమన్నా లిప్‌లాక్‌ సీన్‌పై ఫ్యాన్స్‌ మండిపడుతున్నారు. హద్దులు మీరిన బెడ్‌రూమ్‌ సీన్స్‌ కూడా విమర్శలకు దారి తీస్తున్నాయి. 2016లో తమన్నా ఓ స్టేట్‌మెంట్‌ ఇచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ముద్దు సన్నివేశాలలో నటించను అని ప్రకటించిన తమన్నా ఇప్పుడు అలాంటి సీన్లలో శ్రుతిమించి నటించడంతో నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రియాక్టయ్యారు తమన్నా. హీరోలు బోల్డ్‌ సన్నివేశాలలో నటిస్తే ఎవరూ విమర్శలు చేయరని, నటీమణులు చేస్తే మాత్రం ఇంతటి వ్యతిరేకత ఎందుకు వస్తుందో తనకు అర్థం కావడం లేదని ఆమె అన్నారు. ప్రస్తుతం మనం ఉన్న యుగంలో ఇలాంటి వ్యతిరేకత వస్తుందని తాను అసలు అనుకోలేదని, కొంతమంది పురుషులు సోషల్‌ మీడియాలలో తనపై ఇలాంటి విమర్శలు చేయడం చూస్తుంటే వింతగా ఉందని అన్నారు. చిన్న వయసులోనే తాను సినిమా ఇండస్ట్రీకి వచ్చానని, కెరీర్‌ మొదలైనప్పటి నుంచి గ్లామర్‌ పాత్రలు పోషిస్తూనే ఉన్నానని చెప్పారు. అంతే కానీ మొదట్లో డీ గ్లామర్‌ రోల్స్ చేసి, సడన్‌గా ఇలాంటి రోల్స్‌ చేయలేదని అన్నారు. ఒక నటి ఇంటిమేట్‌ సీన్స్‌లో నటిస్తే పర్సనల్‌ ఎటాక్‌కు ఎందుకు పాల్పడుతున్నారో తనకు అర్థం కావడం లేదన్నారు. హీరోలు కూడా ఇలాంటి సీన్స్‌ తరచూ చేస్తూనే ఉంటారని, వాళ్లు సూపర్‌స్టార్స్‌ కూడా అవుతారని తమన్నా పేర్కొన్నారు. ఈ 18 ఏళ్ల కెరీర్‌లో కొన్ని రూల్స్‌ పాటించానని, నో కిస్‌ పాలసీ కూడా తన కాంట్రాక్ట్‌లో ఉంటుందని, అయితే, కెరీర్‌పరంగా వృద్ధి చెందాలంటే మారాలనే భావనతోనే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్‌లు చేశానని తమన్నా తెలిపారు.
గుజరాతీ అమ్మాయి అయిన తమన్నా తెలుగులోనే కాదు, తమిళం, హిందీ భాషలలో కూడా నటించారు. ప్రస్తుతం తమన్నా సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) సరసన జైలర్‌ (Jailer) సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమా ఆగస్టు 10వ తేదీన విడుదల కాబోతున్నది. ఈ సినిమాతో పాటు అరణ్మణై -4లో కూడా నటిస్తున్నారు.

Updated On 5 July 2023 1:58 AM GMT
Ehatv

Ehatv

Next Story